అసలు కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తాడా..? లేదా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలనే డిమాండ్ కూడా ఉండేది. ఆ డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న రాజకీయ పార్టీలు విద్యార్థులు, నిరుద్యోగులతో ఆందోళన నిర్వహించిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తీరడం లేదు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం.. అంటూ కాలం గడుపుతుంది తప్పా సరైన నోటిఫికేషన్లు ఒక్కటీ ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపోతున్నారు. గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ […]

Written By: NARESH, Updated On : May 20, 2021 1:08 pm
Follow us on

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలనే డిమాండ్ కూడా ఉండేది. ఆ డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న రాజకీయ పార్టీలు విద్యార్థులు, నిరుద్యోగులతో ఆందోళన నిర్వహించిన తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా నిరుద్యోగ సమస్య మాత్రం తీరడం లేదు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం.. అంటూ కాలం గడుపుతుంది తప్పా సరైన నోటిఫికేషన్లు ఒక్కటీ ఇవ్వలేదని నిరుద్యోగులు మండిపోతున్నారు.

గతంలో దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పరాభావం తిన్న టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆ తరువాత ఢిల్లీ వెళ్లారు. వెంటనే 50 వేల ఉద్యోగాలంటూ ప్రకటన చేశారు. అయితే కేసీఆర్ ప్రకటనలు ఆర్బాటంగా ఉంటాయి గానీ.. అమలులో మాత్రం తేడా ఉంటుందని పాపం నిరుద్యోగులు చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు. ఇక 50 వేల ఉద్యోగాల ప్రకటన తెరపైకి రాగానే ఖమ్మం, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ప్రతాపం చూపిన టీఆర్ఎస్ ఇప్పటికైనా నోటిఫికేషన్ వేస్తుందా..? అని ఎదురుచూస్తున్నారు.

ఇక ఉద్యోగాల ప్రకటన చేసే టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఒకరిద్దరు రిటైరయ్యారు. ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసింది. మరి నిరుద్యోగుల భర్తీ ఎప్పుడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు రెండేళ్లకు పెంచింది. దీంతో ఇప్పట్లో ఖాళీలయ్యే అవకాశం లేదు. అందువల్ల మరో రెండేళ్లు నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితే ఉంటుందని అంటున్నారు. అసలు కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తాడా..? లేదా..? అన్నది ప్రశ్నార్థకంగానే మారిపోతుందా..? అని అందరూ అంటున్నారు.