అదే నిజమైతే.. ఏపీ సర్కార్ కు బ్యాడ్ సిగ్నలేనా..?

ఎంపీ రఘురామ అరెస్టు అనేక మలుపుతు తిరుగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ మరో రెండు రోజులు ఇక్కడే ఉండేట్లు కనిపిస్తోంది. ఆయన అరెస్టు తరువాత రమేశ్ ఆసుపత్రికి తరలించాలన్న హైకోర్టు ఆదేశాలను సీఐడీ పట్టించుకోకపోవడంతో ఎంపీ తరుపున న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో ఆర్మీ ఆసుపత్రిలో రఘురామచికిత్సపై వీడియో కూడా తీస్తున్నారు. దీంతో ఆయన రిపోర్టు సాయంత్రకల్లా వస్తుందని అంటున్నారు. అయితే రిపోర్టుపై అందరూ ఆసక్తిగా […]

Written By: NARESH, Updated On : May 20, 2021 12:57 pm
Follow us on

ఎంపీ రఘురామ అరెస్టు అనేక మలుపుతు తిరుగుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ మరో రెండు రోజులు ఇక్కడే ఉండేట్లు కనిపిస్తోంది. ఆయన అరెస్టు తరువాత రమేశ్ ఆసుపత్రికి తరలించాలన్న హైకోర్టు ఆదేశాలను సీఐడీ పట్టించుకోకపోవడంతో ఎంపీ తరుపున న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో ఆర్మీ ఆసుపత్రిలో రఘురామచికిత్సపై వీడియో కూడా తీస్తున్నారు. దీంతో ఆయన రిపోర్టు సాయంత్రకల్లా వస్తుందని అంటున్నారు. అయితే రిపోర్టుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈనెల 21 వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనకు అంతా బాగుంటే చిన్న వైద్య పరీక్షలు చేసి జైలుకు పంపేవారు. మూడురోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుండడంపై పలువురు రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పటి వరకు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే రిపోర్టు వస్తే మాత్రం అటు సీఐడీకి, ఇటు ప్రభుత్వానికి బ్యాడ్ సిగ్నల్ వచ్చినట్లేనని అంటున్నారు.

ఇదిలా ఉండగా రఘురామ ఆరోగ్య పరిస్థితిపై వీడియోగ్రఫీ, స్టేట్ మెంట్ ను సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు జ్యూడిషియల్ అధికారి పంపిస్తారు. ఆ తరువాత తీర్పు ఎలా ఉంటుందన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది. అదేరోజున ఎంపీ బెయిల్ పై హిరయరింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో ఈనెల 21న తీర్పు ఎటువైపు ఉంటుందోన్న చర్చ ఆసక్తిగా మారింది.