సరిగ్గా పనిచేయనందుకు జీతం కట్: చిత్తూరు కలెక్టర్ షాకింగ్ నిర్ణయం..

విధుల్లో నిర్లక్ష్యాన్ని వహించారని కొందరు ఉద్యోగులపై ఏపీలోని చిత్తూరు కలెక్టర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారి జీతాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అలసత్వాన్ని ప్రదర్శిస్తారని మనం అక్కడక్కడా చూస్తాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని ఆ కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో వారికి వచ్చే జీతాలను రాకుండా చేశారు. కరోనా నేపథ్యంలో భాగంగా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు […]

Written By: NARESH, Updated On : May 20, 2021 1:13 pm
Follow us on

విధుల్లో నిర్లక్ష్యాన్ని వహించారని కొందరు ఉద్యోగులపై ఏపీలోని చిత్తూరు కలెక్టర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారి జీతాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల్లో కొందరు అలసత్వాన్ని ప్రదర్శిస్తారని మనం అక్కడక్కడా చూస్తాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని ఆ కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో వారికి వచ్చే జీతాలను రాకుండా చేశారు.

కరోనా నేపథ్యంలో భాగంగా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు ప్రత్యేకంగా నియమించి ఈ పనులు చేయాలని ఆదేశించింది. అయితే చిత్తూరు జిల్లాలోని పెద్దమండ్యం, తవణం పల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, సచివాలయం, మున్సిపల్ శాఖకు చెందిన ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించారు.

ఆయా మండలాలన నుంచి సరైన నివేదికలు ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీనికి బాధ్యతగా ఆ శాఖకు చెందిన ఉద్యోగులపై ఫనిష్మెంట్ చేశారు. వారి జీతాలను చెల్లించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. విపత్తు నిర్వహణ చట్టం కింద వీరి జీతాలను నిలిపివేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఓ వైపు ఏపీ మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని అల్లకల్లోమవుతోంది. ఈ నేపథ్యంలో కేసులు ఎక్కువ, తక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించేందుకు ఇంటింటి సర్వేను చేపట్టింది. కానీ కొందరు ఉద్యోగులు మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి విధులు నిర్వహించడం లేదు. ఇక మరెవరైనా ఇలాంటి నిర్లక్ష్యం చేస్తే ఇలాగే కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.