Homeజాతీయ వార్తలుCM KCR: కేసీఆర్ నిజంగానే జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతారా?

CM KCR: కేసీఆర్ నిజంగానే జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతారా?

CM KCR: ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌ను శాసించే దిశ‌గా ముందుకు వెళుతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇన్నాళ్లు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఒక్క‌రే బీజేపీపై పోరాటం చేయ‌గా ప్ర‌స్తుతం కేసీఆర్ కూడా తోడ‌య్యారు. మ‌మ‌తా బెన‌ర్జీ పోషించిన పాత్ర‌ను కేసీఆర్ నిర్వ‌హించేందుకు ముందుకు వ‌చ్చారు. దీంతో మూడో కూట‌మి ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌లయ్యారు. ఇప్ప‌టికే స్టాలిన్, విజ‌య‌న్, తేజ‌స్వి యాద‌వ్, అఖిలేష్ యాద‌వ్ త‌దిత‌రుల‌ను క‌లిసి థ‌ర్డ్ ఫ్రంట్ ఆవశ్య‌క‌త‌ను వివ‌రించారు.

CM KCR
CM KCR

దీంతో మూడో కూట‌మితోనే బీజేపీని ఎదుర్కోవాల‌ని చూస్తున్నారు. ఇందుకు గాను అంద‌రిని క‌లుపుకోవాల‌ని భావిస్తున్నారు. బ‌డ్జెట్ పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ రాష్ట్రాల‌కు మొండిచేయి చూపింద‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ తీరుపై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. దేశంలో బీజేపీని ప‌క్క‌న‌పెట్టే అవ‌కాశం వ‌చ్చిందంటూ ఎద్దేవా చేశారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ బీజేపీని ఎదుర్కోవ‌డానికే సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. కానీ బీజేపీని టార్గెట్ చేసుకుని అధికారం చేప‌ట్ట‌డం అంత సులువు కాద‌నే విష‌యం మాత్రం ఆయ‌న‌కు తెలియ‌డం లేదు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసినా కుద‌ర‌క‌పోవ‌డంతోనే సైలెంట్ అయిపోయింది. కానీ కేసీఆర్ ప్ర‌స్తుతం బీజేపీ, కాంగ్రెసేత‌ర ప‌క్షాల‌తో జ‌ట్టు కట్టేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ వ్యూహాలు జాతీయ స్థాయిలో ఏ మేర‌కు ప‌నిచేస్తాయ‌ని వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. తెలంగాణ‌లో రాజ్యాధికారం చేప‌ట్టినంత ఈజీగా జాతీయ స్థాయిలో రాజ‌కీయం చేయ‌డం వీలు కాద‌నే విష‌యం గ్ర‌హించ‌డం లేదు. దీంతో కూట్లో రాయి ఏర‌నోడు ఏట్లో రాయి ఏరిన‌ట్లు గా ఉంది ప‌రిస్థితి.

Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!

హుజురాబాద్ ఉప ఎన్నిక త‌రువాత టీఆర్ఎస్ లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌త్యామ్నాయంగా ఎదుగుతుంద‌ని భావించింది. దీంతో దీనికి చెక్ పెట్టాల‌నే ఆలోచ‌న‌తోనే ధాన్యం కొనుగోలు అంశం విష‌యంలో కూడా కేంద్రాన్ని నిందించి చివ‌ర‌కు తానే బ‌లైపోయింది. కేసీఆర్ నాట‌కాలు సాగ‌లేదు. దీంతో బీజేపీ టీఆర్ఎస్ పైనే విమ‌ర్శ‌లకు దిగ‌కుండా వాస్త‌వాలు చూపించి టీఆర్ఎస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టింది. ఇక అప్ప‌టి నుంచి బీజేపీని టార్గెట్ చేసుకుంది.

దీంతో దేశంలో బీజేపీని అడ్డుకుని రాష్ట్రంలో కూడా దాని మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థకం చేయాల‌ని త‌లపించింది. కానీ బీజేపీకి ఉన్న ప్ర‌తిష్ట మ‌స‌క‌బార్చేలా చేయాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటున్నా ఆయ‌న ఆశ‌లు నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇంకా ఎన్ని విచిత్రాలు చేస్తారో కూడా తెలియ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Also Read: మేడారం వెళ్లే భక్తులకు తీపికబురు.. మీ ఇంటి ముందుకే ఆర్టీసీ బస్సు సర్వీస్!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version