CM KCR: మమత, అఖిలేశ్ కూట‌మిలో కేసీఆర్ ను పీకే చేర్చుతాడా..?

CM KCR: దేశ రాజకీయాల్లోకి మరో కూటమి రాబోతున్నది. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికి అడుగులు చకచకా పడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాట్లు సాగుతుండగా, ఆ కూటమికి ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మద్దతు తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను కాదని 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమికి ఎవ‌రెవ‌రు మద్దతు […]

Written By: Neelambaram, Updated On : December 6, 2021 1:49 pm
Follow us on

CM KCR: దేశ రాజకీయాల్లోకి మరో కూటమి రాబోతున్నది. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికి అడుగులు చకచకా పడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాట్లు సాగుతుండగా, ఆ కూటమికి ఇప్పటికే ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మద్దతు తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను కాదని 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమికి ఎవ‌రెవ‌రు మద్దతు పలుకుతారో అని అంగ‌తా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

CM KCR

బీజేపీపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఒకవేళ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు పకడ్బందీగా జరిగినట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికలు మహా రంజుగా సాగే చాన్సెస్ ఉన్నాయి.

మరో వైపున బీజేపీ నేత, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ, బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీఏకు అంత సీన్ లేదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో ఇప్పటికే మమత రెండు సార్లు భేటీ అయ్యారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ద్వారా మమత దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ కూటమికి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీని మమతకు దగ్గర చేయాలని పీకే ప్లాన్ చేస్తున్నట్లు టాక్. పీకే నేతృత్వంలోనే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు మమత ప్లాన్ చేసినట్లు చర్చ నడుస్తున్నది.

Also Read: KCR vs MODI: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?

జాతీయ రాజకీయాల్లో మమతకు అవసరమైన వ్యూహాలు అందించేందుకు పీకే ఓకె చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఐప్యాక్ ప్రతినిధులు టీఆర్ఎస్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట. ఐప్యాక్ సర్వేలపై కేసీఆర్ ఆధారపడి ఉన్నారని, త్వరలో పీకేతో కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. ఐ ప్యాక్ ప్రతినిధులు ఇప్పటికే తెలంగాణలోని ప్రగతి భవన్ చేరుకున్నారని టాక్. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అనే ప్రతిపాదనను కేసీఆర్ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్తున్నాననే సంకేతాలనూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మమతకు కేసీఆర్‌ను దగ్గర చేసేందుకు పీకే ట్రై చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లో చేరేందుకు కేసీఆర్ తప్పకుండా ఒప్పుకుంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మమత నేతృత్వంలోని ఈ కూటమి కోసం దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికీ కేసీఆర్ ఓకే చెప్తారని అంటున్నారు.

Also Read: Girl Missing: ఇంటికి తిరిగిరాని అమ్మాయి.. ఇంతకీ ఏం జరిగింది?

Tags