https://oktelugu.com/

KCR in tension: టెన్షన్లో కేసీఆర్.. పార్లమెంట్ కు ఎంపీల డుమ్మా..!

KCR in tension: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు అంశంపై ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్లకార్డులు, నినాదాలు, వాకౌట్లతో టీఆర్ఎస్ ఎంపీలు నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే ఉన్నట్టుండి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని ప్రతీ ధాన్యపు గింజను కేంద్రమే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2021 / 01:13 PM IST
    Follow us on

    KCR in tension: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. తొలిరోజు నుంచే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు అంశంపై ఉభయ సభలను స్తంభింపజేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్లకార్డులు, నినాదాలు, వాకౌట్లతో టీఆర్ఎస్ ఎంపీలు నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే ఉన్నట్టుండి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ కు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

    Winter Session of Parliament 2021

    తెలంగాణలోని ప్రతీ ధాన్యపు గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల గడువు సమీపిస్తుండంతో టీఆర్ఎస్ ఎంపీలు నేడు పార్లమెంట్ కు వెళ్లలేదని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సీఎం కేసీఆర్ స్థానిక ఎంపీలకే అప్పగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే వారంతా పార్లమెంట్ సమావేశాలకు డుమ్మాకొట్టి ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

    తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే ఏకగీవ్రం అయ్యాయి. నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నిక జరుగాల్సి ఉండగా కరీంనగర్లో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా జిల్లాలో టీఆర్ఎస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఆపార్టీకి ఝలక్ ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఎంపీసీటీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల ఓటు కీలకమే కానుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది. కరీంనగర్ జిల్లాలో ఈటల రాజేందర్ తన సత్తా ఏంటో టీఆర్ఎస్ కు రుచిచూపించాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు ఆపార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను క్యాంపులకు తరలిస్తున్నారు.

    Also Read: మమత, అఖిలేశ్ కూట‌మిలో కేసీఆర్ ను పీకే చేర్చుతాడా..?

    ఇప్పటికే పలువురు ఎంపీలు ఆపార్టీకి చెందిన ఓటర్లను గోవా, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు టీఆర్ఎస్ సర్కారు నిధులు కేటాయించకపోవడంపై ఆపార్టీకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు సైతం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోది. దీంతో వీరిని బుజ్జగించడం టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిగా మారింది.మరోవైపు ప్రత్యర్థి పార్టీలు సైతం ఆశావహులను తమవైపు తిప్పుకుంటుండంతో టీఆర్ఎస్ ఎంపీలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

    ఎమ్మెల్సీ ఎన్నికలకు మరో నాలుగురోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే టీఆర్ఎస్ ఎంపీలు యథావిధిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. మళ్లీ వారంతా కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకోవడంతో ఆపార్టీ నేతలు పార్లమెంట్ కు డుమ్మా కొట్టారనే గుసగుసలు విన్పిస్తున్నాయి.

    Also Read: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?