https://oktelugu.com/

కాంగ్రెస్ తో కేసీఆర్, జగన్ జతకడుతారా?

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాధితుడి ఏపీ సీఎం జగన్ ఉన్నారు. అదే కాంగ్రెస్ ను నమ్మించి బాధించిన వ్యక్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. నమ్మి మోసపోయిన జగన్ ఇప్పుడు ఏపీలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ సైతం పటిష్టంగా ఉన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ తో గతంలో అంటకాగిన వారే. కానీ పాపం జగన్ ను కాంగ్రెస్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది.. జైలుకు పంపింది. ఇక కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ నే లేకుండా […]

Written By: , Updated On : April 23, 2021 / 10:28 AM IST
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాధితుడి ఏపీ సీఎం జగన్ ఉన్నారు. అదే కాంగ్రెస్ ను నమ్మించి బాధించిన వ్యక్తిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. నమ్మి మోసపోయిన జగన్ ఇప్పుడు ఏపీలో తిరుగులేని శక్తిగా ఉన్నారు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ సైతం పటిష్టంగా ఉన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ తో గతంలో అంటకాగిన వారే. కానీ పాపం జగన్ ను కాంగ్రెస్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది.. జైలుకు పంపింది. ఇక కేసీఆర్ తెలంగాణలో కాంగ్రెస్ నే లేకుండా చేస్తున్నారు.  అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి గడ్డుకాలమేనని.. కాంగ్రెస్ కు మంచి రోజులని భావిస్తున్న సోనియా గాంధీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను చేరదీస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఏపీలోని రాయలసీమలో ఓ నానుడి ఉంది. రెడ్డిలకు కోపమొస్తే పగ తీర్చుకుంటారు.. లేక తమకు తాము బలైనా తీసుకుంటారు.. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిరూపించింది. కాంగ్రెస్ పార్టీ తరుపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబం కష్టాల్లో పడింది. అప్పటి వరకు  వారి కుటుంబంతో ఉన్న పార్టీ నాయుకులు, అనునాయులు  ఆయన మరణంతో దూరమయ్యారు. దీంతో వైఎస్ సతీమణి విజయమ్మ, ఆయన కుమారుడు జగన్, వైఎస్ షర్మిలలు దు:ఖంతోనే పార్టీని నడిపించాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఢిల్లీకి రమ్మని వైఎస్ సతీమణి, షర్మిలకు కాల్ వచ్చింది. దీంతో సోనియాను కలిసిన వీరికి ఊహించని అవమానం జరిగింది.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన వైఎస్ విజయమ్మ, షర్మిలకు సోనియా వార్నింగ్ ఇచ్చారు. మీ కుమారుడు జగన్ చేస్తున్న ఓదార్పుయాత్రను వెంటనే ఆపెయ్యాలని ఆదేశించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తట్టుకోలేక బలైన కుటుంబాలను పరామర్శించడానికి మాత్రమే ఈ యాత్ర చేపడుతున్నారని వారు చెప్పినా వినకుండా సోనియా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అవమానంగా రాష్ట్రానికి వచ్చిన వీరు కాంగ్రెస్ ను వీడి వైసీపీ స్థాపించి పోరాడారు. చివరకు ప్రజలు ఆదరించారు.

అయితే వైఎస్ మరణం తరువాత కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ రోషయ్యకు సీఎం పదవి ఇచ్చారు. దీనిని ఆసరాగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం..ముఖ్యంగా జగన్ అభిప్రాయం తీసుకోకుండానే తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసింది. అయితే అప్పటి వరకున్న రోషయ్యను తప్పించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం పీటంపై కాంగ్రెస్ కూర్చోబెట్టింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం పరిస్థితి తీవ్రం కావడంతో  ఏమీ చేయలేని కాంగ్రెస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించింది. అయితే ఆ తరువాత కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా ఏపీలో నామరూపాల్లేకుండా మారింది.

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని పెట్టి బలంగా తయారు చేశాడు. కడప ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో సోనియాలో దడ పుట్టింది.  జగన్ పై అక్రమాస్తుల కేసులంటూ ఆయనను జైలుకు పంపింది. దాదాపు 18నెలలు జైలలో ఉన్న జగన్ కు అది క్లిష్ట సమయం. ఓ వైపు పార్టీ మరోవైపు జగన్ ను కాపాడడానికి వైఎస్ విజయమ్మ, షర్మిల, భారతిరెడ్డిలు ఎంతో కష్టపడ్డారు. అప్పటి వరకు వైఎస్ అభిమానులుగా ఉన్న వారు కాంగ్రెస్ అధిష్టానానికి బయపడి వారికి దూరమయ్యారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అప్పటికే రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి.

అయితే దురదృష్టం వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో గెలవలేదు. అయినా ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పార్టీని బలోపేతం చేశారు. కేంద్రం సయోధ్యతో ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో ముందుకెళ్లారు. ఓ జర్నలిస్టుతో పరిచయమైన ప్రశాంత్ కిశోర్ సైతం జగన్తో పనిచేయడానికి ఉత్సాహం చూపారు. యూపీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ తో ఉన్న అగ్రిమెంట్ పూర్తయ్యాక ఐ ప్యాక్ టీం హైదరాబాద్లోని జగన్ కు చెందిన ఓ బిల్డింగ్లో ఆఫీసును పెట్టారు. 100 మందికి పైగా  ఐ ప్యాక్ బృందం దాదాపు రెండేళ్లపాటు జగన్ కోసం పనిచేసింది.

ఈ క్రమంలోనే ప్రజల మద్దతు కూడగట్టేందుకు జగన్ పాదయాత్ర చేశారు. పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలోనూ జగన్ ఎన్నో కష్టాలు పడ్డారు. ఓ దశలో విశాఖ ఏయిర్ పోర్టులో కోడి కత్తి ప్రమాదానికి గురయ్యారు. అయితే జగన్ కు చిన్న గాయమే అయ్యింది. ఇక ఎన్డీఏ నుంచి అప్పటి వరకు అధికారం పంచుకున్న చంద్రబాబు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ బయటకు వచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్తో చేతులు కలిపారు. అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్,టీడీపీలు ఘోర పరాజయం పొందాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఏ ఎన్నికలైనా విజయం సాధిస్తూ ఇప్పుడు వెనుదిరిగి చూసుకోకుండా ఎదిగారు.

తాజాగా కాంగ్రెస్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జగన్ తో కలిసి వెళ్లడానికి సిద్ధమవుతోంది. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి రాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈనేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునేందకు సిద్దమవుతోంది. అయితే తెలంగాణ , ఏపీ లనుంచి కేసీఆర్, జగన్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా..? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ను విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలాంటి కాంగ్రెస్ తో జగన్ జత కట్టనున్నాడా..? అన్నది హాట్ టాపిక్ అవుతోంది.అయితే కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ ను క్షమించానని జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో జగన్ మరోసారి కాంగ్రెస్ తో జతకట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు.