https://oktelugu.com/

Prabhas-Pooja Hegde: ప్రభాస్-పూజాపై వచ్చిన ఆ రూమర్ నిజమే అనిపిస్తుంది

Prabhas-Pooja Hegde: హైదరాబాద్ వేదిక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారీగా ప్రభాస్ అభిమాన గణం ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేషనల్ మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ వేదికపై రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల కాగా.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మెగా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 24, 2021 / 11:06 AM IST
    Follow us on

    Prabhas-Pooja Hegde: హైదరాబాద్ వేదిక రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారీగా ప్రభాస్ అభిమాన గణం ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేషనల్ మీడియా ప్రత్యేకంగా కవర్ చేసింది. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ వేదికపై రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఐదు భాషల్లో రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల కాగా.. సినిమాపై అంచనాలు పెంచేసింది.

    Prabhas-Pooja Hegde

    ఈ మెగా ఈవెంట్ సాక్షిగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ప్రభాస్-పూజా హెగ్డే గురించి ఓ వార్త హల్చల్ చేసింది. పూజాతో ప్రభాస్ కి విబేధాలు తలెత్తాయని, సెట్స్ లో వీరి మధ్య ఆరోగ్యకర వాతావరణం లేదని సదరు వార్తల సారాంశం. షూటింగ్ కి ఆలస్యంగా రావడంతో పాటు, సెట్స్ లో ఆమె ఆటిట్యూడ్ నచ్చని ప్రభాస్ ఆమెపై గుర్రుగా ఉన్నాడని కథనాలు వెలువడ్డాయి. వరుస కథనాల నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందించారు. ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు.

    Also Read: విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా ?

    అంతటితో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే నిన్న రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుకలో పూజాతో ప్రభాస్ వ్యవహరించిన తీరు సదరు కథనాలకు బలం చేకూర్చినట్టైంది. ఈ వేడుకలో పూజా-ప్రభాస్ లు ఒకరి పట్ల మరొకరు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్లు అనిపించారు. జస్ట్ ఏదో సభా మర్యాద కోసం హాయ్ చెప్పుకున్నారు. వేదిక పై ఇద్దరి స్పీచ్ లలో అఫెక్షన్ లోపించింది. ప్రభాస్ గురించి పూజా, పూజా గురించి ప్రభాస్ పొడిపొడిగా ముగించారు.

    ఇద్దరూ కలవడానికి, మాట్లాడుకోవడానికి అసలు ఇష్టపడలేదు. దీంతో రాధే శ్యామ్ షూటింగ్ లో ప్రభాస్ పూజాలకు గొడవైందన్న కథనాలలో నిజం ఉందన్న వాదన వినిపిస్తుంది. నిప్పు లేనిదే పొగరాదంటారు. కాబట్టి షూటింగ్ సమయంలో ఏదో జరిగింది అనేది వాస్తవం. ఇక ప్రభాస్ తో పని చేసే ప్రతి హీరోయిన్ ఆయన స్వీట్ ట్రీట్మెంట్ కి ఫిదా అవుతారు. ప్రపంచంలోని అరుదైన వంటకాలతో తన కోస్టార్ కి ఆతిథ్యం ఇవ్వడం ప్రభాస్ కి అలవాటు. కేవలం పూజా విషయంలోనే వ్యవహారం చెడినట్లు అనిపిస్తోంది.

    Also Read: ఈ సినిమాకు 4 ఏళ్లైతే.. కథకు మాత్రం 18 ఏళ్లు- రాధేశ్యామ్​ డైరక్టర్​

    Tags