Jayasudha: ప్చ్.. జయసుధ కోరిక నెరవేరుతుందా ?

Jayasudha: తెలుగు ప్రజలకు పరిచయమే అవసరం లేని పేరు జయసుధ. తన అందచందాలతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను జయసుధ గెలుచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలలో సైతం ప్రవేశించి విజయం సాధించారు. తాజాగా జయసుధ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ‘నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నాను’ అని జయసుధ అన్నారు. జయసుధ సినిమాల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె […]

Written By: Shiva, Updated On : May 31, 2022 11:00 am
Follow us on

Jayasudha: తెలుగు ప్రజలకు పరిచయమే అవసరం లేని పేరు జయసుధ. తన అందచందాలతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను జయసుధ గెలుచుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలలో సైతం ప్రవేశించి విజయం సాధించారు. తాజాగా జయసుధ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Jayasudha

‘నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కావాలని కోరుకుంటున్నాను’ అని జయసుధ అన్నారు. జయసుధ సినిమాల్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేకస్థానం, మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి.. అమ్మమ్మ పాత్రల వరకూ జయసుధ నటిస్తూనే ఉన్నారు.

Also Read: F3 First Weekend Collections : ‘ఎఫ్ 3’ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ !

ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి సమైక్య రాష్ట్రంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో రాజ్యసభకు సైతం పోటీ చేయాలనుకున్నారు. అంతలో రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం, సపోర్ట్ చేసిన రాజశేఖర్ రెడ్డి మరణించడంతో జయసుధ రాజకీయానికి కాలం కలిసి రాకుండా పోయింది.

Jayasudha

ఆ తర్వాత జయసుధ రాజకీయ జీవితం సాఫీగా సాగలేదు. పార్టీలో కూడా ఆమెకు తగినంత ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి. దాంతో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. అయితే, ఈ మధ్య జయసుధ సినిమాలను బాగా తగ్గించింది. అందుకే, మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆరాట పడుతుంది.

మరి వయసు పెరిగింది కాబట్టి.. మునుపటిలా ఆమెకు ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చు. కానీ, ప్రస్తుతం జయసుధ ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతుంది. మరి ఆమె సినీ జీవితం ఎలా సాగుతుందో చూడాలి.

Also Read: Allu Arjun Shock To Fans: అభిమానులకు ఊహించని షాక్ ఇవ్వబోతున్న అల్లు అర్జున్

Recommended Videos:


Tags