గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా షురువైంది. ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ 20 రోజుల్లోనే ముగియనుంది. దీంతో జీహెచ్‌ఎంసీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే దుబ్బాక పోరులో ఎదురుదెబ్బ తిన్న టీఆర్‌ఎస్.. ఈ ఎన్నికలో ఎలాంటి ఎత్తులు వేయనుంది. మరోసారి దెబ్బతింటుందా.. లేక బలపడుతుందా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు దుబ్బాక రిజల్ట్‌తో బీజేపీ ఉత్సాహంతో ఉంది. ఇప్పుడు గ్రేటర్‌లోనూ ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్‌లో తాము బరిలో నిలుస్తామని ఇప్పటికే జనసేన అధినత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో జనసేన ఏ వైపు నిలుస్తాడా అని ఆసక్తిగా మారింది.
Also Read: ఎంఐఎం, సీపీఐ కంటే దారుణమా? కాంగ్రెస్ పని ఖతమేనా?
గ్రేటర్‌లో కాషాయం జెండా రెపరెపలాడించి.. టీఆర్ఎస్ గట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షమని నమ్ముతున్న జనసేనతో కలిసి బరిలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు.. ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. జనసేన సుమారు 50 కార్పొరేట్ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని కూడా పవన్ వెల్లడించారు. దీంతో గ్రేటర్‌లో పవన్ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాలి.
గ్రేటర్ హైదరాబాద్‌లో సెటిలర్లు ఎక్కువ. ప్రధానంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే ఎక్కువ. వీరిలోనూ పవన్ సామాజిక వర్గమైన కాపు కులానికి చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువే. అదేసమయంలో పవర్ స్టార్‌కు వీరాభిమానులు, అభిమానుల సంఖ్య కూడా ఉంది. దీంతో పవన్ పార్టీపై ఆశలు మెండుగానేఉన్నాయి. గతేడాది ఏపీలో జరిగిన సార్వత్రిక సమరంలో పవన్ పార్టీ ఓటమి పాలైంది. రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీచేసిన పవన్ ఒక్క దాంట్లోనూ విజయం సాధించలేదు. దీంతో ఆ సింపతి ఏమైనా గ్రేటర్‌లో వర్గవుట్ అవుతుందా అనేది ప్రశ్నగా మారింది.
Also Read: ఫస్ట్ లిస్టులో ప్రముఖులకు షాకిచ్చిన కేసీఆర్!
ఏపీలో బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్న జనసేన.. తెలంగాణలో మాత్రం డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు.. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో పవన్ పార్టీని గెలిపిస్తే తమ సమస్యలపై ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని సెటిలర్లు భావిస్తున్నట్టు సమాచారం. యువత ఓట్లు పవన్‌కేననే ప్రచారం అప్పుడే ఊపందుకుంది. మరోవైపు ఏపీ నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు, యూనివర్సిటీల్లో ఉన్నవారు.. పవన్ వైపుమొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. ఇదంతా ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా అనుకున్నారు. కానీ.. చివరికి రిజల్ట్ ఏమైంది..? మరి ఇవన్నీ ఇప్పుడు ఓట్లు రాల్చుతాయా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్