https://oktelugu.com/

ఆ కంటెస్టెంట్ పై ‘బిగ్ బాస్’ కుట్ర..  బయట పెట్టిందెవరు?  .! 

కరోనా టైంలోనూ బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్ షో ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకున్న ప్రస్తుతం 11వ వారంలో కొనసాగుతోంది. అయితే ప్రతీ సీజన్లో బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లను ప్రేక్షకులే ఎలిమినేషన్స్ చేస్తుండగా బిగ్ బాస్-4లో మాత్రం ఆ పాత్రను బిగ్ బాసే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వచ్చేసిందహో..! బిగ్ బాస్-4లో ఎలిమినేట్స్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 01:11 PM IST
    Follow us on

    కరోనా టైంలోనూ బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్ షో ఇప్పటికే పది వారాలను పూర్తి చేసుకున్న ప్రస్తుతం 11వ వారంలో కొనసాగుతోంది. అయితే ప్రతీ సీజన్లో బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లను ప్రేక్షకులే ఎలిమినేషన్స్ చేస్తుండగా బిగ్ బాస్-4లో మాత్రం ఆ పాత్రను బిగ్ బాసే చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వచ్చేసిందహో..!

    బిగ్ బాస్-4లో ఎలిమినేట్స్ పై ఈసారి వస్తున్న విమర్శలు గత సీజన్లలో కూడా రాలేదు. ప్రతీ ఎలిమినేషన్ పై ప్రేక్షకుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. బిగ్ బాస్ ప్రేక్షకులతో సంబంధం లేకుండా తానే ఎలిమినేషన్స్ చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ బిగ్ బాస్ వ్యవహర శైలిలో మార్పురాకపోవడం గమనార్హం.

    తాజాగా బిగ్ బాస్ సొహైల్ ను బ్యాడ్ చేసే కుట్ర చేసినట్లు నెటిజన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వారం నామినేషన్లలో భాగంగా అభిజిత్-అఖిల్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆ వారంలో వీళ్ల గొడవనే బిగ్ బాస్ హైలెట్ చేసి చూపించాడు. వీరితోపాటు అదేరోజు సొహైల్-దెత్తడి హరికలు కూడా గొడవ పడ్డారు. వీరిద్దరు ఒకరు తీవ్రస్థాయిలో మాటలు అనుకున్నారు.

    Also Read: క్రిష్‌పై గుర్రుగా ఉన్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

    ఈక్రమంలో సొహైల్ కంట్రోల్ తప్పి హరికను అమ్మాయి అని చూడకుండా దూషించడం అతడికి నెగిటివ్ గా మారింది. సొహైల్ తీరును పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. అయితే అదేరోజు సొహైల్ హరికకు సారీ చెప్పాడు. దీంతో వీరిద్దరు తర్వాత మళ్లీ కలిసిపోయారు.ఈ ఫుటేజ్ ను మాత్రం బిగ్ బాస్ ఎక్కడ కూడా చూపించలేదు.

    ఈ విషయాన్ని సోహెల్.. అఖిల్‌తో చెప్పడంతో బయటికి వచ్చింది. దీంతో బిగ్ బాస్ కావాలనే సొహైల్ బ్యాడ్ చేస్తున్నాడని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బిగ్ బాస్ ఎవరినైతే బ్యాడ్ చూపిస్తాడో వారే ప్రతీ వారం ఎలిమినేట్ అవుతూ బయటికి వెళుతున్నారు. ఈక్రమంలోనే ఈవారం సొహైల్ ను బయటికి పంపించే కుట్ర జరుగుతుందా? అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్