కరోనా భారత్‌కు ఎంత మేలు చేసిందో తెలుసా?

ప్రతి ఛాలెంజ్‌ ఓ గుణపాఠం నేర్పిస్తుంటుందని అంటుంటారు. ప్రతి సంక్షోభం కూడా ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది. కరోనా మహమ్మారి కూడా ఒక విధంగా అందరికీ అలాంటి గుణపాఠాన్నే నేర్పింది. కరోనాతో ముఖ్యంగా దేశాలకు దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. దీంతో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆలోచింపజేశాయి. ఆర్థిక వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా చేసింది. Also Read: పాము పగ ఏం రేంజ్ లో ఉంటుందో ఈ సంఘటన చూపించింది కరోనాతో […]

Written By: NARESH, Updated On : November 19, 2020 2:14 pm
Follow us on

ప్రతి ఛాలెంజ్‌ ఓ గుణపాఠం నేర్పిస్తుంటుందని అంటుంటారు. ప్రతి సంక్షోభం కూడా ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది. కరోనా మహమ్మారి కూడా ఒక విధంగా అందరికీ అలాంటి గుణపాఠాన్నే నేర్పింది. కరోనాతో ముఖ్యంగా దేశాలకు దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయాయి. దీంతో ఆ ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆలోచింపజేశాయి. ఆర్థిక వనరుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా చేసింది.

Also Read: పాము పగ ఏం రేంజ్ లో ఉంటుందో ఈ సంఘటన చూపించింది

కరోనాతో ముఖ్యంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ప్రపంచ దేశాల పారిశ్రామిక రంగాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. నిరుద్యోగం పెరిగింది. కానీ.. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా వైరస్‌ లాభం చేసిందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. స్వయం సమృద్ధి సాధించడానికి.. విదేశీల నుంచి వచ్చే సహాయంపై ఆధారపడకుండా ఉండే అవకాశాన్ని తెచ్చిపెట్టిందట. కరోనా వైరస్‌ ప్రజారోగ్యంపై వినాశకరమైన ప్రభావం చూపుతోందని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించిందని..2020లో ప్రపంచ జీడీపీ 4.4% తగ్గిపోతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.

అయితే.. ఇది వింతగా అనిపించినా ప్రస్తుత సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ఆర్థిక స్వయం సమృద్ధి దిశగా ఒక మార్గాన్ని అందించగలదని అంచనా వేసింది. అంతే కాకుండా, ధనిక దేశాలు దేశీయ పాండమిక్ రికవరీలపై దృష్టి సారించడంతో వాటి అభివృద్ధి క్షీణించింది. ఇది 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే 60 శాతం ఎక్కువ. అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్వావలంబన కావడానికి కొత్త స్టార్టర్స్ కంపెనీలు వస్తాయి.

Also Read: దానిమ్మ జ్యూస్ తో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చా..?

ఇ–-కామర్స్ ను గణనీయంగా పెంచడం ద్వారా పోస్ట్-పాండమిక్ రికవరీలో డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుడుల మధ్య మంచి పోటీని సూచిస్తోంది. ఆగస్టు నాటికి బంగ్లాదేశ్ యొక్క ఇ–-కామర్స్ రంగం సంవత్సరానికి 26% పెరిగింది. ఇతర దక్షిణాసియా దేశాలు కూడా ఇదే విధమైన ధోరణిని చూపుతున్నాయి. ఆరోగ్యం, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత గురించి ప్రజలు మరింతగా తెలుసుకోవడంతో ఆరోగ్య-సంరక్షణ మరియు ఔషధ రంగాలు పాండమిక్ అనంతరం ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.అందుకే.. అభివృద్ధి చెందుతున్న దేశాలు దేశీయ వనరులను సమీకరించుకుంటాయి. అందుకే.. కరోనా కాస్త అభివృద్ధి చెందుతున్న దేశాలకు మంచి సందేశాన్నే ఇచ్చిందని అంటున్నారు నిపుణులు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్