KCR-Jagan: బీజేపీయేతర పక్షాలతో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో అన్ని మార్గాలు వెతుకుతున్నారు. దీని కోసం ఇప్పటికే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్ లాంటి రాష్ట్రాలను ఏకం చేసిన కేసీఆర్ మరో అడుగు ముందుకేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కూడా తమ జట్టులో చేర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్, జగన్ మధ్య సత్సంబంధాలు ఉన్నా గత కొంత కాలంగా నీళ్ల విషయంలో విభేదాలు పొడచూపిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం కేసీఆర్ మూడో కూటమి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో బాగంగా జగన్ ను కూడా ఆహ్వానించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కానీ బీజేపీతో జగన్ కు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేసుల నేపథ్యంలో కేంద్రంతో సత్సంబంధాలే కొనసాగించే అవసరం ఉంది. అందుకే జగన్ బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూ ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు కూడా అలా చేస్తేనే మనుగడ ఉంటుంది. కానీ కేసీఆర్ తో కూడా జగన్ కు ఉన్న సంబంధాల క్రమంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు.
2024 ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీని దెబ్బతీయాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతున్నక్రమంలో దానికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ భావిస్తున్నారు. దీని కోసమే మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో దెబ్బతీయాలని చూస్తున్నారు. దీంతోనే బీజేపీకి అడ్డు తగలాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం
ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? లేక ఆలోచిస్తారా? అనేదే తేలాల్సి ఉంది. కేసీఆర్ కు జగన్ తో ఉన్న సాన్నిహిత్యంతో జగన్ కేసీఆర్ వెంట వెళతారా? బీజేపీతో ఉంటారా? అన్న ఆలోచన అందరిలో వస్తోంది. దీంతో కేసీఆర్ వ్యూహం ఎంత మేర పనిచేస్తుంది. మూడో కూటమి ప్రయత్నాలు విజయవంతం అవుతాయో తెలియడం లేదు.
ఏది ఏమైనా కేసీఆర్ ప్రజాఫ్రంట్ కూటమి ఏర్పాటుకు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఆయనకు ఎంత మంది కలిసి వస్తారు? ఏ మేరకు సక్సెస్ సాధిస్తారో వేచిచూడాల్సిందే. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నంలో బీజేపీపై ఏ మేరకు ప్రభావం చూపిస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. కానీ దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ఎదుర్కోవడం అంటే మాటలు కాదనే విషయం తెలిసిందే.
Also Read: గౌతం సవాంగ్ బదిలీతో జగన్ కు చిక్కులేనా?