Homeఎంటర్టైన్మెంట్Sharwanand: ఫిబ్రవరి 19న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ట్రైలర్

Sharwanand: ఫిబ్రవరి 19న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ట్రైలర్

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఫిబ్రవరి 19న ట్రైలర్ ను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఇటీవల మొదలు కాగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Will Rashmika continue her hit streak
Rashmika Mandanna And Sharwanand

కాగా శర్వానంద్ ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పైగా గత కొన్ని సినిమాలకు శర్వానంద్ కి అన్నీ ప్లాప్ లే వస్తున్నాయి. దాంతో శర్వానంద్ కెరీర్ చాలా డౌన్ లో ఉంది. కాబట్టి.. ఈ సినిమా అతనికి బాగా ప్లస్ కానుంది. పైగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది కాబట్టి.. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. పైగా శర్వానంద్, రష్మిక జోడీ కూడా బాగా కుదిరింది.

Also Read:  సొంత మ‌ర‌ద‌ళ్ల‌ను పెండ్లి చేసుకున్న స్టార్ హీరోలు వీరే..!

కాకపోతే.. ఈ సినిమాని అనుకున్న రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని చిన్న ఇష్యూ జరుగుతుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతతో గొడవకు దిగుతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడో ఈ సినిమాకు డీల్స్ కుదిరాయి. డీల్స్ కుదుర్చుకున్న తర్వాత రేట్లు పెంచడం కరెక్ట్ కాదు అని డిస్ట్రిబ్యూటర్లు వాదిస్తున్నారు.

Sharwanand
Sharwanand

 

కాగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు రావు అని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే.. ముందు అనుకున్న రేటుకే సినిమాని ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఇచ్చిన మొత్తంలో కనీసం 35 శాతం అయినా తమకు వెనక్కి ఇవ్వాలని, లేదంటే తమకు నష్టాలు తప్పవని వాళ్లంతా నిర్మాతల చుట్టూ తిరుగుతున్నారు.

Also Read:  గౌతం స‌వాంగ్ బ‌దిలీతో జ‌గ‌న్ కు చిక్కులేనా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Youth: మీ జీవిత లక్ష్యం ఏంటని అడిగితే..? మంచి చదువు.. ఆ తరువాత మంచి ఉద్యోగం.. ఇక పెళ్లి.. ఆ తరువాత ఫ్యామిలీ లైఫ్.. అని చాలా మంది చెబుతారు.. అయితే కొందరు ఇలా చెప్పకున్నా వారి జీవితా దాదాపుగా ఇలాగే గడుస్తుంది. కానీ నేటితరం యువత మారుతోంది. పాతతరం యువతకు భిన్నంగా ఆలోచిస్తుంది. జీవితంలో పెళ్లి, ఉద్యోగమే కాదు… ఇంకేదో సాధించాలని అంటున్నారు.. ఓ గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటికోసం పరుగులు పెడుతున్నారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ ఒకే రంగాన్ని ఎంచుకోకుండా రకరకాల మార్గాలను ఎంచుకొని వాటి వెంట వెళుతున్నారు. […]

Comments are closed.

Exit mobile version