కాంగ్రెస్ స్వయంకృతం: జగన్‌ని పిలిస్తే వస్తాడా..?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టిన కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పుడు ‘రెంటికి చెడ్డ రేవడిలా’ తయారైంది. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతుండగా.. ఏపీలో మాత్రం ఎప్పుడో పాడె కట్టిన పరిస్థితి ఉంది. అటు కేంద్రంలోనూ బీజేపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక డీలా పడింది.  రెండుసార్లు అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు అయోమయంలో పడింది. ఇంకా చెప్పాలంటే అంతటి జాతీయ పార్టీలో ఇప్పుడు కుమ్ములాటలు మొదలయ్యాయి. అధ్యక్షుడి విషయంలో అంతర్గతపోరు నడుస్తూనే ఉంది. ఇటీవల పలువురు సీనియర్లు సోనియా […]

Written By: NARESH, Updated On : September 6, 2020 4:59 pm

AP Mudragada Kapu movement ... Is it a new headache for Jagan ..?

Follow us on


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టిన కాంగ్రెస్‌ పరిస్థితి ఇప్పుడు ‘రెంటికి చెడ్డ రేవడిలా’ తయారైంది. తెలంగాణలో పార్టీ రోజురోజుకూ దిగజారిపోతుండగా.. ఏపీలో మాత్రం ఎప్పుడో పాడె కట్టిన పరిస్థితి ఉంది. అటు కేంద్రంలోనూ బీజేపీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేక డీలా పడింది.  రెండుసార్లు అధికారాన్ని కోల్పోయి ఇప్పుడు అయోమయంలో పడింది. ఇంకా చెప్పాలంటే అంతటి జాతీయ పార్టీలో ఇప్పుడు కుమ్ములాటలు మొదలయ్యాయి. అధ్యక్షుడి విషయంలో అంతర్గతపోరు నడుస్తూనే ఉంది. ఇటీవల పలువురు సీనియర్లు సోనియా మీద అసంతృప్తి అస్త్రం సంధించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌లో వర్గపోరు అంతాఇంతా కాదు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పుడు జాతీయ కాంగ్రెస్‌ దృష్టి ప్రాంతీయ పార్టీల మీద పడిందంట. సోనియాగాంధీకి కొత్త మిత్రుడు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఈ మంచి సలహా ఇచ్చాడంట. జగన్, మమతా బెనర్జీ వంటి వారిని కాంగ్రెస్ వైపుగా ఆకర్షించాలన్నది ఈ విలువైన సూచన. ఆ సలహా వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అసలు సాధ్యమయ్యేలా లేదు. దేశంలో కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్న నేతలను కాంగ్రెస్ మళ్లీ దగ్గరకు తీయాలంటే ఎవరు ముందుకు వస్తారు.

Also Read: నూతన్ నాయుడుపై నాలుగో కేసు.. దిమ్మదిరిగే వాస్తవాలు

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ.. అందులోనూ ఏపీ సీఎం జగన్‌కి తల్లిలాంటి పార్టీ అనడంలో అతిశయోక్తి లేదు. ఏపీలోని కీలకనాయకులందరికీ దాదాపు ఇంకా కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్‌‌, చంద్రబాబు, జగన్‌ రాజకీయ మొదలైంది కూడా కాంగ్రెస్‌ నుంచే. కేసీఆర్‌‌, చంద్రబాబుకు ఏమో కానీ.. జగన్‌కు కాంగ్రెస్‌కు ఉన్న అటాచ్‌మెంట్‌ గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తండ్రి వైఎస్సార్‌‌ మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. రెండు సార్లు పీసీసీ చీఫ్‌గా.. రెండు సార్లు సీఎంగా గెలుపొందారు.

వైఎస్సార్‌‌ మరణానంతరం జాతీయ కాంగ్రెస్‌… జగన్‌ని ఎంతటి స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టిందో తెలిసిందే. ఏడాదికి పైగా జైల్లోనూ పెట్టి ప్రజలకు, ఫ్యామిలీకి దూరం చేసింది. సీబీఐ ఎంక్వైరీ చేసినా ఇంతవరకు అందులో పెద్దగా తప్పులు దొరకలేదు. సోనియా గాంధీ చెప్పుడు మాటలు వినే యువనేత జగన్‌ని దూరం చేసుకున్నాడు. జైలు నుంచి బయటికి వచ్చాక కాంగ్రెస్‌లో ఉండలేక జగన్‌ వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించాడు. అప్పటి నుంచి ఆ పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నాడు. పైగా ఇప్పుడు బీజేపీ దోస్తానా చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ట్రెండ్‌ అవుతున్న విషయం. ఇదంతా చూస్తే కాంగ్రెస్‌ చేజేతులా చేసుకున్న పాపమే జగన్‌ దూరం చేసుకోవడం అని అనుకోవాలి.

ఫస్ట్‌ టైం అధికారం రాకున్నా.. నిత్యం ప్రజల్లోనే ఉండి అధికారం కోసం పోరాడారు వైఎస్‌ జగన్‌. ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో తాను కోరుకున్న సీఎం కుర్చీ సంపాదించారు. ఇక ఇప్పుడు జగన్‌ ఎదురులేని స్థితిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పరిస్థితిలో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏ మాత్రం మార్పులేదు. తండ్రి అంత స్థాయిలో ఉండి ప్రజలకు సేవ చేయబట్టే జగన్‌కు కూడా జనంలో ఆ పేరు వచ్చింది. ఆ పెట్టుబడే జగన్ రాజకీయ జీవితానికి ఇంధనం అయింది.

Also Read: హైకోర్టు మీ ఇష్టం అనేసినా… జగన్ మాకొద్దు అన్నాడు

ఇప్పుడున్న రాజకీయాల్లో కాంగ్రెస్‌కు జగన్‌ అవసరం ఉండొచ్చు కానీ.. జగన్‌కు కాంగ్రెస్‌ అవసరం ఇసుమంతైనా లేదు. నిజం చెప్పాలంటే నాలుగున్నరేళ్లపాటు యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ రాజీపడలేదు, ఇక ఫ్యూచర్‌‌లో ఎప్పుడు అధికారంలోకి వస్తుందో.. అసలు వస్తుందో రాదో కూడా తెలియని కాంగ్రెస్‌తో ఇప్పుడు ఎలా జతకడుతాడు..? తన అవమానాలు భరించి మరీ సోనియమ్మ, రాహుల్ గాంధీ భజన ఎందుకు చేస్తాడు..?  ఇప్పుడు కాంగ్రెస్‌లో సోనియా, రాహుల్ శకం దాదాపుగా ముగిసేలా ఉంది. రేపటి రోజున దేశంలో బీజేపీకి పోటీగా ప్రాంతీయ పార్టీలు సమాఖ్యగా ముందుకు వస్తే జగన్ మరింత ఎత్తున జాతీయ రాజకీయాల్లో నిలుస్తారు. అందువల్ల జగన్ కాంగ్రెస్ పిలిచినా అ వైపుగా వెళ్లరు, చూడరు అనేది కాంగ్రెస్‌ పార్టీ తెలుసుకోవాల్సిందే.