YS Sharmila’s son : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరుగత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు వారు అంగీకరించారు. ప్రియా అట్లూరికి వైయస్ విజయమ్మ చీర పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రియా అట్లూరి తాత ప్రసాద్ చట్నీస్ సంస్థల అధినేత. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.చంద్రబాబుకి దగ్గర బంధువు అని సమాచారం.ఇక రాజారెడ్డి తండ్రి అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. షర్మిల తో ఈయనకు ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం అనిల్ కుమార్ క్రైస్తవ మత బోధకుడిగా కొనసాగుతున్నారు. జగన్ పెద్ద కుమార్తెకు రాజారెడ్డికి ఇచ్చి వివాహం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఏమైందో తెలియదు గానీ అది ప్రచారానికి పరిమితమైంది. ఇప్పుడు ప్రియా అట్లూరితో ప్రేమ, పెళ్లి జరుగుతుండడంతో అది ఉత్త మాటగానే తేలిపోయింది.
ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు వివాహం ఏర్పాట్లలో ఉన్నారు. వైయస్ జగన్ ఇంట్లోపెళ్లి చేస్తారని ప్రచారం జరుగుతోంది.అదే జరిగితే అన్నా చెల్లెలు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని వైయస్ కుటుంబ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకు జగన్కు పెళ్లి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. అయితే వైసిపి వర్గాలు మాత్రం మేనమామ హోదాలో జగన్ దగ్గరుండి పెళ్లి చేయిస్తారని చెబుతున్నారు.ప్రస్తుతంజగన్,షర్మిలల మధ్య మాటలు లేవు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది. అయితే తెలంగాణ రాజకీయాల్లోషర్మిల అంతగా రాణించలేకపోయారు.కాంగ్రెస్లో చేరతారని భావిస్తున్నారు.ఏపీలో యాక్టివ్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.అదే జరిగితే వైసీపీకి నష్టం కలగక మానదు.ఇటువంటి తరుణంలో మేనల్లుడు వివాహానికి జగన్ హాజరవుతారా? లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.