జగన్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణాలివే?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఆందోళనల వేళ జగన్ ఢిల్లీకు వెళ్లడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అకస్మాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణాలేంటని పార్టీ వర్గాల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. మోదీని కలవడానికి జగన్ ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనని తెలుస్తోంది. Also Read : వ్యవసాయ […]

Written By: Navya, Updated On : September 22, 2020 1:53 pm
Follow us on

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఆందోళనల వేళ జగన్ ఢిల్లీకు వెళ్లడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అకస్మాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణాలేంటని పార్టీ వర్గాల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ ఢిల్లీకి బయలుదేరనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. మోదీని కలవడానికి జగన్ ప్రయత్నిస్తున్నా అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనని తెలుస్తోంది.

Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?

అమిత్ షాతో పాటు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ లను జగన్ అపాయింట్మెంట్లు కోరారని వాళ్ల నుంచి అనుమతి లభించిందని సమాచారం. జగన్ ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి చర్చించటానికి ఢిల్లీకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులు, జీఎస్టీ పరిహారం, కరోనా నియంత్రణ, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధుల గురించి జగన్ చర్చించే అవకాశం ఉంది.

వీటితో పాటు రాష్ట్రంలో విగ్రహల ధ్వంసం, డిక్లరేషన్ వివాదం గురించి కూడా జగన్ అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. గత పర్యటనలకు భిన్నంగా జగన్ ఈసారి రెండు రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారని సమాచారం. మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని దళారీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన చేయడం రాజ్యసభలో దుమారం రేపిన సంగతి తెలిసిందే.

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీలో పలు పార్టీలు నిరసనలకు పిలుపునివ్వగా ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. మార్చిలో లాక్ డౌన్ అమలైనప్పటి నుంచి జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఢిల్లీ పర్యటన అనంతరం జగన్ బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవలో పాల్గొని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?