Homeజాతీయ వార్తలుHyderabad Press Club: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు కానున్నాయా?

Hyderabad Press Club: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు కానున్నాయా?

Hyderabad Press Club: తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అవకతవకలపై ప్రెస్ క్లబ్ సభ్యుల ఫిర్యాదు మేరకు నిర్వాహకులు ఆ దిశగా డిసైడ్ అయ్యారు. ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలైంది. నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించారని పిటీషనర్ ఆరోపించారు.

ప్రధానంగా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ గుర్తు కాకుండా మరో గుర్తు ఉందని.. దానిని పరిగణలోకి తీసుకోకుండా ఓట్లు లెక్కించాలని వాదనలు జరిగాయని పేర్కొంటున్నారు. ఈ మేరకు కోర్టు తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.

గత ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బ్యాలెట్ పేపర్ పైన ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును మాత్రమే ఉపయోగించాలి. కానీ కొన్ని బ్యాలెట్ పేపర్ల పై రౌండ్ ముద్ర, మరికొన్ని బ్యాలెట్ పేపర్ ల పైన ఇంటూ గుర్తులు ఉన్నాయి. ఇవి గమనించిన ప్రెసిడెంట్ అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన అభ్యంతరాన్ని తెలియజేశారు.

అదే విధంగా పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థులకు పడ్డ ఓట్లు, చెల్లని ఓట్లు, మొత్తం సమానం కాలేదు. అంటే మొత్తం ఓట్లలో కొన్ని ఓట్లు గల్లంతయ్యాయి. ఈ అంశాలపై ప్రధానంగా అభ్యంతరం తెలపడంతో స్వస్తిక్ గుర్తుకు బదులు రౌండ్ సీల్ ఎలా వచ్చింది. కొన్ని బ్యాలెట్ పేపర్ల పై ఇంటూ గుర్తు ఎలా వేశారు అనేది తేలేంత వరకు హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి నిలిపి వేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద జర్నలిస్టుల క్లబ్ అయిన హైదరాబాద్ లో పదవులు నిర్వహిస్తే అది వారిని అధికార పార్టీలకు చేరువ చేస్తుందని.. అందుకే మేనేజ్ మెంట్ కమిటీని కైవసం చేసుకునేందుకు బడా జర్నలిస్టులంతా రంగంలోకి దిగి గెలిచేందుకు చాలా తతంగం నడిపారని ఆరోపణలున్నాయి.

ఇక ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భారీగా డబ్బు చేతులు మారిందని.. పోలింగ్ కు ఒకరోజు ముందు కొందరు ప్రెస్ క్లబ్ సభ్యులకు డబ్బు పంచి సీనియర్ జర్నలిస్టుల మద్దతును కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Asia Cup 2022: ఈనెల 26న ఐపీఎల్( ఇండియన్ ప్రీమియం లీగ్) ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ వీక్షించేందుకు జోష్ మీద వున్న క్రికెట్ అభిమానులకు ఆసియా కప్ కబురు విందు భోజనంలా అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆసియ కప్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా శనివారం ఒక ప్రకటన వెళుబడడమే అని చెప్పవచ్చు. ఆసియా కప్ లో ఆడనున్న జట్ల సభ్యులు ఇందుకుగాను కప్ నిర్వహణపై చర్చించారు. […]

  2. […] Mallu Swarajyam: అరుణకిరణం అస్తమించింది. సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో అనారోగ్యంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న స్వరాజ్యం ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజా సమస్యల పక్షాన నిలిచింది. అలుపెరగని పోరాటంలో ఎప్పుడు వెనుదిరగలేదు. జీవన గమనంలో కూడా ఆమె వెనక్కి చూడలేదు. ఎప్పుడు ముందుండి పోరాటాలు నడిపించడమే ధ్యేయంగా కదిలారు. మహిళ అయినా సమస్యల పరిష్కారంలో తనదైన శైలి అనుసరించే వారు. రజాకార్లతో జరిగిన పోరాటంలో కూడా ఆమె తన పాత్ర పోషించారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular