https://oktelugu.com/

ఈటలకు బీజేపీలో కలిసొచ్చేనా?

మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో సోమవారం చేరారు. పార్టీలో చేరిన రోజే సీన్ అర్థమైపోయింది. బీజేపీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. పార్టీలో చేరే కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు దూరంగా ఉండిపోయారు. ఒడిషాకు చెందిన కేంద్రమంత్రి దేవేంద్ర ప్రధాన్ తో కండువా కప్పించారు. దేవేంద్ర ప్రధాన్ తో కండువా కప్పించుకోవడానికి ఢిల్లీ దాకా పోవాలా అనే ప్రశ్న అందరిలో మెదిలింది. కానీ ఏమీ అనలేకపోయారు. ఈటలతో పాటు నేతలు మనసు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ప్రారంభమే. అసలు […]

Written By: , Updated On : June 15, 2021 / 01:15 PM IST
Follow us on

Etelaమాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో సోమవారం చేరారు. పార్టీలో చేరిన రోజే సీన్ అర్థమైపోయింది. బీజేపీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. పార్టీలో చేరే కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు దూరంగా ఉండిపోయారు. ఒడిషాకు చెందిన కేంద్రమంత్రి దేవేంద్ర ప్రధాన్ తో కండువా కప్పించారు. దేవేంద్ర ప్రధాన్ తో కండువా కప్పించుకోవడానికి ఢిల్లీ దాకా పోవాలా అనే ప్రశ్న అందరిలో మెదిలింది. కానీ ఏమీ అనలేకపోయారు. ఈటలతో పాటు నేతలు మనసు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది.

ఇది ప్రారంభమే. అసలు సినిమా ముందుంది. పార్టీలో ఈటలకు దక్కే ప్రాధాన్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో చేరేటప్పుడు నువ్వే తోపు అంటారు. తరువాత నువు పనికిరావు అంటారు. దీంతో ఈటల భవితవ్యంపై అప్పుడే అంచనాలు తలకిందులవుతున్నాయి. పార్టీలో చేరేటప్పుడు బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలోనే చేరతానని హామీ తీసుకున్నారు. కానీ చివరికి జరిగిందేమిటో తెలిసింది కదా.

ఈ నేపథ్యంలో ఈటల స్థానంపై అప్పుడే చర్చ జరుగుతోంది. ఆయన ప్రాధాన్యంపై నాయకుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈటలకు ఏ పదవులు ఇస్తారో ఎక్కడ ఉంచుతారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో హుజురాబాద్ లో గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ బీజేపీకి బలం నిల్. విజయం సాధించాలంటే ఈటల బలమే ప్లస్. ఓడిపోతే మాత్రం ఈటల ప్రస్థానమే ప్రశ్నార్థకం.

బీజేపీలో నేతల మధ్య పొసగడం లేదు. అందరికి అధిష్టానం వద్ద పలుకుబడి ఉంది. దీంతో ఈటల కూడా తన తాహత్తును పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుడు అయిన ఈటల తన పరిధిని విస్తరించుకునే క్రమంలో అధినాయకత్వం దగ్గర మార్కులు కొట్టేయాల్సిన ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్తులో పార్టీలో దూసుకుపోవాలంటే తన ప్రాబల్యాన్ని విస్తరించుకునే దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.