సినిమాల విడుదల తేదీలు ఆ నలుగురి చేతిలోనే !

కరోనా సెకెండ్ వేవ్ ఇక ఎన్నాళ్ళు ఉంటుందో క్లారిటీ వచ్చింది. అందుకే, దర్శక నిర్మాతలు జులై సెకండ్ వీక్ నుండి షూటింగ్ లకు సన్నద్ధం అవుతున్నారు. అలాగే చిన్నాచితకా చిత్రాలు కూడా షూటింగ్స్ కోసం చకచకా పరుగులు పెట్టనున్నాయి. అయితే, రిలీజ్ పరిస్థితి ఏమిటి ? బాక్సాఫీస్ మీద వారం వారం సినిమాల మీద సినిమాలు వచ్చి పడితే, కలెక్షన్స్ వస్తాయా ?, అసలు ఏవరేజ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయా ? ఇప్పుడున్న లిస్ట్ చూస్తే.. […]

Written By: admin, Updated On : June 15, 2021 1:21 pm
Follow us on

కరోనా సెకెండ్ వేవ్ ఇక ఎన్నాళ్ళు ఉంటుందో క్లారిటీ వచ్చింది. అందుకే, దర్శక నిర్మాతలు జులై సెకండ్ వీక్ నుండి షూటింగ్ లకు సన్నద్ధం అవుతున్నారు. అలాగే చిన్నాచితకా చిత్రాలు కూడా షూటింగ్స్ కోసం చకచకా పరుగులు పెట్టనున్నాయి. అయితే, రిలీజ్ పరిస్థితి ఏమిటి ? బాక్సాఫీస్ మీద వారం వారం సినిమాల మీద సినిమాలు వచ్చి పడితే, కలెక్షన్స్ వస్తాయా ?, అసలు ఏవరేజ్ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవుతాయా ?

ఇప్పుడున్న లిస్ట్ చూస్తే.. ఒక్కోవారం అయిదు నుండి ఏడు సినిమాలు విడుదలయ్యేలా ఉంది వ్యవహారం. స్టార్ హీరో సినిమాలకు సైతం సోలో డేట్ దొరికేలా లేదు. చివరకు ఆచార్య, కేజిఎఫ్ లాంటి భారీ సినిమాలకి కూడా పోటీ ఉండేలా ఉంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి మల్టీ స్టారర్ కు ఎలాగూ దారిచ్చేస్తారు. కానీ ఎన్నాళ్ళు అనేది సినిమా రిజల్ట్ ను బట్టే ఉంటుంది. సినిమా అటు ఇటుగా ఉంటే వెంటనే ఆ సినిమా పై కూడా తమ సినిమా రిలీజ్ కి నిర్మాతలు పక్కా స్కెచ్ తో ఉంటారు.

ఐతే, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న థియేటర్ల లెక్కలను బట్టి, స్టార్ హీరో సినిమాతో పాటు మరో సినిమా కూడా రిలీజ్ చేసుకునేంత స్పేస్ ఉంది. అంటే రెండు పెద్ద సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. ఆ స్కోప్ ఉన్నా టాలీవుడ్ జనాలు మాత్రం సోలో రిలీజ్ కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. పైగా నాలుగింట మూడు వంతులు సినిమాలు దిల్ రాజు, అల్లు రవీంద్, సురేష్ బాబు లాంటి వారి చేతే డిస్ట్రిబ్యూట్ అవుతాయి.

కాబట్టి, ఏ సినిమా పై ఏ సినిమా పోటీగా రావాలి అనే అంశాన్ని కూడా వాళ్లే డిసైడ్ చేసే అవకాశం ఉంది. అలాగే మరో డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ కి కూడా థియేటర్స్ పై మంచి పట్టు ఉన్నా.. ఆయన చిన్న సినిమాలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది చెప్పలేం. మొత్తమ్మీద డిస్ట్రిబ్యూషన్లు చేతలో ఉన్న ఆ నలుగురు రానున్న సినిమాల విడుదల తేదీలను నిర్ణయించనున్నారు.