https://oktelugu.com/

కాంగ్రెస్ వైపు చూస్తున్న డీఎస్?

ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్). కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా, ఎమ్మెల్సేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో పదవులను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం పోరాడిన నేతల్లో డీఎస్ కూడా ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఆపార్టీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 30, 2020 / 07:44 PM IST
    Follow us on


    ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్). కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా, ఎమ్మెల్సేగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో పదవులను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం పోరాడిన నేతల్లో డీఎస్ కూడా ఒకరు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలతో ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఆపార్టీలో చేరిపోయారు.

    Also Read: బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.

    టీఆర్ఎస్ లో డీఎస్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానని పలుసార్లు బహిరంగగానే వాపోయారు. అయితే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినపుడు డీఎస్ తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతారనే ప్రచారం జరిగింది. దీనిని ఆయన పలుసార్లు ఖండించారు. ఆయన టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నప్పటికీ యాక్టివ్ గా మాత్రం కన్పించడం లేదు. కిందటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేసిన ఆయన కుమారుడి గెలుపు కోసం పనిచేశారని కామెంట్స్ వచ్చాయి.

    డీఎస్ తన అనుచరులను ముందస్తుగా బీజేపీకి పంపి తనయుడిని గెలిపించుకున్నారని టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ ఆయనను పక్కను పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నించిన సీఎం ఆయనకు అపాయింట్ ఇవ్వలేదని సమాచారం. దీంతో తాను చేసేదేమీలేక సైలంటయ్యారనే టాక్ ఉంది. ప్రస్తుతం టెక్నికల్ గా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా డీఎస్ కొనసాగుతున్నారు.

    Also Read: తెలంగాణలో కరోనా.. ఆశ్చర్యపోయే లెక్కలు

    డీఎస్ రాజ్యసభ సీటును కేసీఆర్ ఎలాగు రెన్యూవల్ చేసే అవకాశం లేదనే టాక్ విన్పిస్తుంది. దీంతో ఆయన సొంతగూటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన తనయుడు బీజేపీలో ఎంపీగా కొనసాగుతుండటంతో బీజేపీలో చేరాలా? లేక కాంగ్రెస్ లో చేరాలా? అని తేల్చుకోలేకపోతున్నారు. డీఎస్ అనుచరులు కూడా బీజేపీలోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నా.. ఆయన మనస్సుంతా కాంగ్రెస్ వైపు లాగుతుందని డీఎస్ సన్నిహితులు చెబుతున్నారు.

    ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నేతలతో తరుచూ టచ్లో ఉంటూ డీఎస్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని టాక్ విన్పిస్తుంది. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీనిపై డీఎస్ క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే..!