CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో తనదైన ముద్ర చూపిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి ఉండకూడదని అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు గాను అధికారుల్లో జవాబుదారీ తనం ఉండాలని సూచిస్తున్నారు. కానీ రాజధాని విషయంలో మాత్రం ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. అమరావతి రాజధానిగా చేసిన చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించిన జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి అందరిని అయోమయానికి గురిచేశారు. కానీ ప్రస్తుతం తాడేపల్లి నుంచే తన సేవలు కొనసాగిస్తున్నారు.

పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించినా అది కుదరడం లేదు. కేసు కోర్టులో పెండింగులో ఉన్నందున జగన్ నిర్ణయాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా ఆయన హామీ నీటిమూటగానే మిగిలిపోతోంది. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేస్తానని ఇచ్చిన హామీ నేటికి కూడా నెరవేరడం లేదు. తాడేపల్లి నుంచి విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తారని వార్తలు వస్తున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఫలితంగా ప్రజల్లో కూడా ఆశలు నీరుగారుతున్నాయి.
గత మున్సిపల్ ఎన్నికల్లోనే విశాఖకు మార్చాలని నిర్ణయించినా సాధ్యం కావడం లేదు. విశాఖ బీచ్ లో ఓ భవనాన్ని చూశారని ఇక తరలింపు తరువాయే అని వార్తలు వచ్చినా తరువాత అవి వట్టివే అతి తేలిపోయాయి. దీంతో జగన్ తప్పనిసరి పరిస్థితుల్లో తాడేపల్లి నుంచే తన సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో మూడు రాజధానుల వ్యవహారం కాస్త వెనుకబడినట్లే అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రతిసారి పండుగల తర్వాత తరలిస్తామని ముహూర్తం పెట్టుకుంటున్నా అది నెరవేరడం లేదు.
అమరావతి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నందున సీఎం జగన్ ఏ నిర్ణయం కూడా తీసుకోవడం లేదు. ఫలితంగా ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు మూడు రాజధానుల వ్యవహారం కొలిక్కి వస్తుందనే అనే సందేహాలు కూడా అందరిలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు ఆలస్యమవుతుంటే అసలు ఇది సాధ్యం కాదేమోననే సంశయాలు రావడం సహజమే.