Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఆందోళన చెందుతోంది. తమ పార్టీ కార్యాలయాలు, ఇళ్లపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలను కలిసి పరిస్థితి విన్నవించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారి అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ దొరికినట్లు సమాచారం. కానీ మోడీ, షా అపాయింట్ మెంట్ మాత్రం ఇంకా దొరకలేదని తెలుస్తోంది.

ఏపీలో జరిగిన గొడవల తరువాత చంద్రబాబు నేరుగా అమిత్ షాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అందుకే బాబు ఢిల్లీ వెళ్లి వారితో చర్చించనున్నట్లు సమాచారం. కానీ మోడీ, షా అపాయింట్ మెంట్ ఇంకా బాబుకు దొరకనట్లు తెలుస్తోంది. సోమవారం వరకు వారి అపాయింట్ మెంట్ దొరికితే వారికి ఫిర్యాదు చేసి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలతో రాష్ర్టంలో పరిస్థితులు పలు మలుపులు తిరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య వైరం పార్టీల మధ్య రగడ సృష్టిస్తోంది. వ్యక్తిగత దూషణల నుంచి భౌతిక దాడుల వరకు వెళ్లడం దారుణమే. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపి వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా రాష్ర్టంలో మరో రాజకీయ ఉద్యమం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి.
మోడీ, షా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇస్తే వైసీపీకి నష్టమే అని తెలుస్తోంది. ఇన్నాళ్లు బాబును దూరం పెట్టిన కేంద్రం తనతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనకు ఓటు వేస్తే ఆయనకు అపాయింట్ మెంట్ ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ బాబుకు ఆ చాన్స్ దొరికితే జగన్ కు కూడా చిక్కులు తప్పవనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఏమేరకు ఢిల్లీలో చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే.