Rashmika Mandanna: కిరాక్ పార్టీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రష్మికా మందన్న .విజయ్ దేవరకొండ తో ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయింది.గీత గోవిందం హిట్ అవ్వడంతో.. ఈ జంట మరోసారి ‘డియర్ కామ్రెడ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి మహేష్ బాబు, కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ లో మహేష్ బాబు కి జోడిగా రష్మికా మందన్న నటించి వరుసగా సూపర్ హిట్‌లు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.సౌత్ ఇండియా హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ భామ బాలీవుడ్ లో సిద్దార్ధ్ మల్హోత్రాతో సినిమా చేయనున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో లో రష్మిక జిమ్’లో వర్కౌట్ చేస్తూ ఉంటుంది. ఇందులో తన ట్రైనీతో కిక్ బ్యాగ్ పై సాలిడ్ పంచ్ లు ఇస్తూ గట్టిగా కష్టపడుతున్నారు రష్మిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే విడుదలైన శ్రీవల్లి సాంగ్ కూడా మంచి హిట్ అందుకుంది.