Etela Bandhu: హుజురాబాద్ ఉప ఎన్నికలో పలు కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలనే ఉధ్దేశంతో దళితుల ఓట్లు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం దళితబంధు. దీనికి ముమ్మాటికి ఈటల పేరు పెట్టాలని ఓ కొత్త ప్రతిపాదన చేశారు. దీంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

అసలు దళితబంధు పథకానికి కర్త, కర్మ, క్రియ అన్ని ఈటల రాజేందర్ అని కిషన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. అలాంటి స్కీంకు ఆయన పేరు పెడితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికైనా ఆలోచించి దళితబంధుకు ఈటల బంధుగా నామకరణం చేసి ఆయనకే అంకితం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయాల్లో కొత్త అలజడి ప్రారంభం అయింది.
తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన పథకం దళితబంధు కేవలం ఈటలను ఎదుర్కోవాలనే వెలుగులోకి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. దళితబంధు రూపకల్పనలో ఈటల పాత్ర ఉందని గుర్తు చేస్తున్నారు. ఈటలను ఓడించాలనే లక్ష్యంతోనే కేసీఆర్ దళితబంధు పథకం కోసం శ్రమించారని చెబుతున్నారు. దీంతోనే దీనికి ఈటల పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలకు వారి పేర్లు పెట్టుకోవడం తెలిసిందే. దీంతో ఈటల కోసం చేపట్టిన పథకానికి ఆయన పేరు పెట్టడానికి కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో కిషన్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై అందరిలో ఆలోచనలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి డిమాండ్ సరైనదే అనే వాదన కూడా వినిపిస్తోంది.