BRS
BRS: తెలంగాణలో పదేళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకరాం చేశారు. 11 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబోటి మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రతిపక్షం కూడా బలంగా ఉండడోతోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ 64+సీపీఐ 1, బీఆర్‌ఎస్ 38, బీజేపీ 8, ఎంఐఎం 7 సీట్లు ఉన్నాయి. అయితే 5గురు మద్దతు ఉప సంహరించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ రోజులు ఉండదని ప్రకటనలు చేస్తున్నారు.
కేసీఆర్ మదిలో ఏముంది..
ప్రకటన విషయం అలా ఉంచితే గులాబీ బాస్, బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏముంది అన్న చర్చ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా కొనసాగనిస్తారా.. లేక మధ్యలోనే దించుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. గతంలో కాంగ్రెస్‌ను చీల్చిన చరిత్ర కేసీఆర్‌కు ఉంది. మరోవైపు దేశంలో అత్యంత ధనిక పార్టీ బీఆర్‌ఎస్. దీంతో డబ్బులు ఆశ చూపి కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు.
మైండ్‌గేమ్‌తో..
కేసీఆర్ మైండ్‌గేమ్‌తో సర్కార్‌ను కూలుస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్‌ఎస్ నుంచే నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతారని అంటున్నారు. దీనిపై నానా రచ్చ చేసి, ప్రజలు మెజారిటీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, తన అనుకూల మీడియాలో నానాయాగి చేస్తారని అంటున్నారు. తర్వాత కొంతకాలానికి, కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతోపాటు, మరో 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి లాక్కుంటారని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంతోపాటు, బీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలని..
ప్రజలు మెజారిటీ ఇచ్చిన మేరకే ప్రభుత్వం పాలన సాగించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాలనుకునే వారిపట్ల మరింత అప్రమత్తత అవసరం అంటున్నారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజల ముందు దోషిగా నిలిపి ప్రభుత్వాన్ని కూలదోస్తారని హెచ్చరిస్తున్నారు.
అందరిది ఒక లోకం మల్లి గానిది ఒక భావి
pic.twitter.com/Z60NiaOyv2— Scofield Reddy (@Affiliated2Ts) December 8, 2023
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will brs topple congress government will kcr play mind game
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com