BJP Operation Aakarsh: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో చేరికల కమిటీకి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వివిధ పార్టీల్లోని నేతలను బీజేపీలోకి రప్పించేందుకు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో ఓ బృందం ఢిల్లీ వెళ్లింది. అక్కడ బీజేపీ పెద్దలను కలుసుకుని పార్టీలో చేరే వారి పేర్లు వివరించనున్నారు. పార్టీలో చేరే వారి గురించి చర్చించనున్నారు. కమిటీలో సభ్యురాలిగా ఉన్న మాజీ మంత్రి డీకే అరుణ సైతం ఈటలతో ఢిల్లీ వెళ్లారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై పార్టీ పెద్దలతో చర్చకు వచ్చే అవకాశముంది. మరోవైపు రాజగోపాల్రెడ్డి పార్టీ మారకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. ఆయన బీజేపీలో చేరకుండా చూడాలని నిర్దేశించింది. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఈటల రాజేందర్ బృందంతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపి ఆపరేషన్ ఆకర్ష్ కు న్యాయం చేసేలా చేయాలని వారికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: YCP Government: వైసీపీ సర్కారుకు కష్టం నుంచి గట్టెక్కించిన జయప్రకాష్ నారాయణ..
ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి పేర్లు వెల్లడించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో ఇంకా ఎవరెవరు పార్టీలోకి వ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే వారి లిస్టు చూపించనున్నట్లు చెబుతున్నారు. ఈటల బృందం ఇతర పార్టీల నేతల పేర్లు సూచించడంతో వారిని ఎలా తీసుకురావాలనే దానిపై కూలంకషంగా చర్చించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర నేతలను కలవనున్నారు. వారితో పార్టీ భవిష్యత్ గురించి వివరంగా అధినాయకత్వానికి అందించనుంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ మొదటి నుంచి చెబుతుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత గురించి కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ బలాబలాలపై కూడా చర్చకు రానుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలంటే అధికార పార్టీని టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. దీని కోసం అధిష్టానం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నేతల్లో సమన్వయం కల్పించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్ని మార్గాల్లో అన్వేషణ ప్రారంభించింది.
Also Read:ABN RK Politics: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణది మామూలు తెలివికాదు? ఏం చేశాడో తెలుసా?