Pawan Kalyan- Sandeep Reddy Vanga: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ స్టేటస్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో తో పని చెయ్యాలని ప్రతి స్టార్ డైరెక్టర్ కి ఉంటుంది..దర్శక ధీరుడు రాజమౌళి వంటి వాడు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలి అనేది నా డ్రీం అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు..కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల రాజమౌళి తో సినిమా చెయ్యలేకపోయాడు..ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ కి ఆయనతో పని చెయ్యాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ ని చూసి వారు తమ కెరీర్ ని రిస్క్ చేయలేకపోతున్నారు..కానీ ఒక స్టార్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓకే అయ్యింది అని ఇండస్ట్రీ లో గత కొద్దీ రోజుల నుండి ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది.

ఆయన మరెవరో కాదు..మన టాలీవుడ్ లోనే పాత్ బ్రేకింగ్ క్లాసిక్ మూవీ గా నిలిచినా అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ..ఇప్పుడు లేటెస్ట్ గా యూత్ ఫాలోయింగ్ లో బాగా ట్రెండ్ అవుతున్న విజయ్ దేవరకొండ కి స్టార్ స్టేటస్ ని రప్పించింది ఈ చిత్రం..అంతే కాకుండా ఇదే సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరు తో రీమేక్ చేస్తే అక్కడ దాదాపుగా 300 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది.
Also Read: NTR Daughter Umamaheswari: షాకింగ్ : ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ కుమార్తె.. కారణం అదే కావొచ్చు
ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో ‘స్పిరిట్’ మరియు రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే సినిమాలను ప్రకటించాడు..ఇప్పటికే ‘ఎనిమల్’ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది..ఈ రెండు సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడట.

గత కొంతకాలం క్రితం ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసి స్టోరీ వినిపించగా ఆయనకీ ఎంతో నచ్చింది..పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొనిరా, కచ్చితంగా ఈ సినిమా మనం చేద్దాము అని చెప్పాడట..ఆయన పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటిస్తారట..ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సెప్టెంబర్ 2 వ తారీఖున వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు..వాస్తవానికి సందీప్ రెడ్డి వంగ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమాని..కొన్ని సందర్భాలలో ట్విట్టర్ లో ఈ విషయాన్నీ ఆయన చెప్పుకొచ్చాడు కూడా..ఒక అభిమాని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇదివరకే మనం గబ్బర్ సింగ్ సినిమాకి చూసాం..త్వరలోనే ఆ మేజిక్ ఈ సినిమాతో కూడా రేపటి కానుంది.
Also Read:Jayasudha Shocking Comments: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించి ?, వివక్ష పోవాలంటే ఏం చేయాలి ?
Recommended Videos