బీజేపీ విభజన పాలి‘ట్రిక్స్‌’ నడిపిస్తోందా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా రాష్ట్రాలను కలుపుకొని పోయి పాలన నడిపిస్తుండాలి. కానీ.. ఇప్పుడున్న బీజేపీ మాత్రం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఉద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చేస్తోంది. కేవలం దక్షిణాది ప్రజల్లో సమస్యలపై స్పందించే లక్షణం ఎక్కువ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేరళలో జరిగిన ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరాదిని అవమానించడమేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ప్రస్తుతం కేరళ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం […]

Written By: Srinivas, Updated On : February 25, 2021 4:13 pm
Follow us on


కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా రాష్ట్రాలను కలుపుకొని పోయి పాలన నడిపిస్తుండాలి. కానీ.. ఇప్పుడున్న బీజేపీ మాత్రం విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఉద్వేగాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు చేస్తోంది. కేవలం దక్షిణాది ప్రజల్లో సమస్యలపై స్పందించే లక్షణం ఎక్కువ అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేరళలో జరిగిన ఓ బహిరంగసభలో వ్యాఖ్యానించారు. ఇది ఉత్తరాదిని అవమానించడమేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ప్రస్తుతం కేరళ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ అక్కడ తరచూ పర్యటిస్తున్నారు. మొన్నటి పర్యటనలో తాను ఉత్తరాదిలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను.. కేరళలో ఎంపీగా తను అనుభవాలను వివరించారు.

Also Read: పటేల్‌ స్టేడియానికి మోడీ పేరు : రాజకీయ దుమారం

దీనిని పోల్చి చూడటం బీజేపీ నేతలకు మంచి అవకాశంగా మారింది. ఆయన ఉత్తరాదిని అవమానించారంటూ విమర్శలు ప్రారంభించారు. హిందీ మీడియా మొత్తం బీజేపీ అనుకూలమే కావడంతోవారికి అనుకూలంగా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రకరకాలుగా విశ్లేషణలు చేశారు. అయితే.. అసలు రాహుల్ గాంధీ అన్నదాంట్లో వివాదాస్పదం ఏముందో ఎవరూ చెప్పలేకపోయారు. ఉత్తరాది కన్నా.. దక్షిణాది ప్రజల సమస్యలపై స్పందించే గుణం ఎక్కువ ఆయన ప్రధానంగా చెప్పారు. ఇది ఉత్తరాదిని కించ పర్చడం ఎలా అవుతుందో బీజేపీ నేతలకే తెలియాలి.

Also Read: ‘ప్రైవేటీకరణపై’ బయటపడ్డ మోడీ.. అంతా షాక్

రాజకీయాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం.. ఉత్తరాది, దక్షిణాది తేడాలు చూపించడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ఇక్కడి ప్రజలలో బలపడేలా.. కేంద్రం పాలన ఉంది. కీలకమైన ప్రాజెక్టులేవీ.. దక్షిణాదికి దక్కడం లేదు. కానీ పన్నుల్లో వాటాలు మాత్రం అత్యధికం దక్షిణాది నుంచే వెళ్తున్నాయి. అందుకే.. బీజేపీ రాజకీయం చేస్తున్న తీరు ప్రమాదకరం అన్న సంకేతాలు వెళ్తున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

అందుకే.. సందర్భం వచ్చినప్పుడల్లా దక్షిణాది సీఎంలు మాట్లాడుతూనే ఉన్నారు. టాక్స్‌లు ఇక్కడి నుంచే ఎక్కువ మొత్తంలో వెళ్తున్నా తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మొత్తుకుంటూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో దక్షిణాది సీఎంలు ఏకమై పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ వ్యత్యాసం భారీగా కనిపించింది. కానీ.. చివరకు ఏమైందో ఏమో కానీ సీఎంలు వెనక్కి తగ్గారు. లేదంటే ఇప్పటికి ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చే అవకాశమే ఉండేది.