జోబైడెన్ సంచలనం.. విదేశీయులకు గొప్ప ఊరట

గద్దెనెక్కిన తర్వాత ట్రంప్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఉపసంహరింప చేస్తున్న కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ సర్కార్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ రద్దు చేసిన విసాల నిషేధాన్ని జోబైడెన్ ఉపసంహరించుకున్నారు. కరోనా వైరస్ అమెరికాలో ఉధృతంగా ఉన్న సమయంలో లాక్ డౌన్ తో అమెరికాలోని ప్రజలు , కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. అమెరికన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందనే కారణంగా నాడు అమెరికన్లకు ఉద్యోగ […]

Written By: NARESH, Updated On : February 25, 2021 3:20 pm
Follow us on

గద్దెనెక్కిన తర్వాత ట్రంప్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఉపసంహరింప చేస్తున్న కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ సర్కార్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ రద్దు చేసిన విసాల నిషేధాన్ని జోబైడెన్ ఉపసంహరించుకున్నారు.

కరోనా వైరస్ అమెరికాలో ఉధృతంగా ఉన్న సమయంలో లాక్ డౌన్ తో అమెరికాలోని ప్రజలు , కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. అమెరికన్లపై ప్రతికూల ప్రభావం పడుతుందనే కారణంగా నాడు అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ట్రంప్ సర్కార్ గతంలో విదేశీ వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ పరిణామం వీసా లబ్దిదారులను ఇబ్బంది పెట్టడంతోపాటు బయట నుంచి నిపుణులు, కార్మికులు రాకపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెచ్చింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

ఈ క్రమంలోనే ఆ ఆదేశాలను జోబైడెన్ తాజాగా ఉపసంహరించుకున్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా నాగరికుల కుటుంబ సభ్యులతో కలవనీయకుండా చేస్తోందని.. దీంతో దేశానికే హాని అని జోబైడెన్ అన్నారు. అమెరికా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను వినియోగించుకోకుండా చేస్తోందని తెలిపారు.

ట్రంప్ తీసుకున్న వలసల నిషేధం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని.. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని జోబైడెన్ తెలిపారు.

ఈ క్రమంలోనే గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంపై ట్రంప్ నిర్ణయాన్ని ఎత్తివేసి అమెరికా ఏటా 55 వేల మందికి గ్రీన్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అసలైన పని ఇప్పుడే మొదలైందని.. దాదాపు 5 లక్షల పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

జోబైడెన్ నిర్ణయంతో విదేశీలు, వలసదారులు, వృత్తి నిపుణులు ముఖ్యంగా భారతీయ టెకీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.