పీకే స్కెచ్ గీస్తే బీజేపీ ఓడిపోవడమేనా?

దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన కనుక స్కెచ్ గీస్తే ఇక ప్రత్యర్థులు తప్పించుకోలేరనే టాక్ రాజకీయవర్గాల్లో ఉంది. అలాంటి పీకే 2019 ఎన్నికల్లో జగన్ ను ఏపీ సీఎంను చేశారు. అంతకుముందు ఢిల్లీలో కేజ్రీవాల్ ను గెలిపించారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పీకే బీజేపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. కమలదళానికి వ్యతిరేకంగానే పీకే రాజకీయాలు చేస్తుంటారు. ఈ కోవలోనే బెంగాల్ లో మమతా […]

Written By: NARESH, Updated On : May 2, 2021 3:35 pm
Follow us on

దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆయన కనుక స్కెచ్ గీస్తే ఇక ప్రత్యర్థులు తప్పించుకోలేరనే టాక్ రాజకీయవర్గాల్లో ఉంది. అలాంటి పీకే 2019 ఎన్నికల్లో జగన్ ను ఏపీ సీఎంను చేశారు. అంతకుముందు ఢిల్లీలో కేజ్రీవాల్ ను గెలిపించారు. ఇక ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పీకే బీజేపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు.

కమలదళానికి వ్యతిరేకంగానే పీకే రాజకీయాలు చేస్తుంటారు. ఈ కోవలోనే బెంగాల్ లో మమతా బెనర్జీని ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోడీషాలకు పీకే ఎదురునిలిచారు. బెంగాల్ సీఎం మమత తరుఫున రాజకీయ వ్యూహకర్తగా మారారు.

బెంగాల్ లో మమతను ఎంత అస్తిరపరచాలని చూసినా పీకే రాజకీయ వ్యూహాల ముందు బీజేపీ నిలవలేకపోయి ఓడిపోయింది. బెంగల్ లో మమతపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం.. కాలికి పట్టి కట్టుకొని ప్రచారం చేయాలన్నది పీకే ఆలోచనే. ఆ సానుభూతినే బెంగాల్ లో మమతను గెలిపించిందని అంటారు.

ఇక మోడీషాల విమర్శలకు గత డిసెంబర్ లోనే పీకే కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ బెంగాల్ లో 100 సీట్లు గెలవదని.. గెలిస్తే తాను దేనికైనా సిద్ధమని ట్విట్టర్ లో సవాల్ చేశారు.

అన్నట్టుగా నేటి ఫలితాల్లో అదే పునరావృతమైంది. దీంతో నాటి ట్వీట్ ను పిన్ చేసి మరోసారి పీకే బీజేపీని దెప్పి పొడిచారు.