Telangana BJP: తెలంగాణలో బీజేపీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నా ఫలితాలు మాత్రం ఆ రేంజ్ లో ఉండటం లేదని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించి అధికారం చేపడతామని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. కానీ వారు చెబుతున్న దానికి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉంటోంది. పార్టీలో చేరికలు భారీ స్థాయిలో ఉంటాయని ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభానికి ముందు సందడి చేశారు. కానీ ఎక్కడ కూడా ఓ స్థాయి ఉన్న నేతలు పార్టీలో చేరడం లేదు. దీంతో బీజేపీ నేతలు చెబుతున్నవన్ని అబద్దాలే అని ప్రత్యర్థి పార్టీలు చెబుతున్నాయి.

హుజురాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీలో జోష్ కనిపించినా ప్రస్తుతం ఆ ఛాయలు కానరావడం లేదు. ఫలితంగా పార్టీ కేడర్ నైరాశ్యంలో పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట పెరగాలంటే పార్టీలోకి వలసలు పెరగాలి. మంచి పట్టున్న నేతలు పార్టీలోకి వస్తే వారితో జనం కూడా ఉండి మంచి పరపతి వస్తుంది. దీంతో పార్టీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు మార్గం సుగమం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క నేత కూడా పార్టీ కండువా కప్పుకోలేదు.
Also Read: KTR- AP TDP Leaders: కేటీఆర్ పై గురిపెట్టి వైసీపీని కాలుస్తున్న టీడీపీ..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం బీజేపీలో చేరతారని ప్రచారం సాగినా ఆయన చేరేందుకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు వెంకట్రామిరెడ్డి కూడా వెనుకకు పోతున్నట్లు సమాచారం. దీంతో బీజేపీ నేతలు చెబుతున్నవన్ని ఉట్టి మాటలే అని తేలిపోతోంది. కానీ భవిష్యత్ లో పార్టీ ఇలాగే ఉంటే నిలదొక్కుకోవడం కష్టమే అని తెలిసిపోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యంపై నేతల్లో ఆందోళన నెలకొంది.

కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత పార్టీని గాడిలో పెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ కు ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రజల్లో టాక్ రావడంతో రాష్ర్టంలో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో చేరేందుకు వివిధ పార్టీల నేతలు మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నా ఎవరు కూడా చేరడం లేదని చెబుతున్నారు.
బీజేపీ నేతలు పైకి గాంభీర్యం వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం మథనపడుతున్నట్లు సమాచారం. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంత మేర ప్రభావం చూపుతుందో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో త్రిముఖ పోరులో విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.
Also Read:PM Modi- Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలుండరని మోడీ సంచలన వ్యాఖ్యలు
Recommended Videos:


