https://oktelugu.com/

Malavika Mohanan: మరో సావిత్రి అనుకుంటే.. చివరకు షకీలా అయ్యింది !

Malavika Mohanan: ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా క్రేజ్ తగ్గి చాలా కాలమే అయింది. ఐటమ్ గాళ్ గా మెప్పిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. ‘మాస్టర్’ సినిమాలో మాళవిక మోహనన్ నటించినా.. ఆ సినిమాతో ఆమెకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ‘మాళవిక మోహనన్’ను హీరోయిన్ గా పెట్టుకోవడం శానా కష్టం అని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. ఇక, ఆమెకి సోలో హీరోయిన్ గా కెరీర్ కట్ అయినట్టే. అందుకే కాబోలు, మాళవిక […]

Written By:
  • Shiva
  • , Updated On : May 3, 2022 / 02:14 PM IST
    Follow us on

    Malavika Mohanan: ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా క్రేజ్ తగ్గి చాలా కాలమే అయింది. ఐటమ్ గాళ్ గా మెప్పిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. ‘మాస్టర్’ సినిమాలో మాళవిక మోహనన్ నటించినా.. ఆ సినిమాతో ఆమెకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ‘మాళవిక మోహనన్’ను హీరోయిన్ గా పెట్టుకోవడం శానా కష్టం అని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు.

    Malavika Mohanan

    ఇక, ఆమెకి సోలో హీరోయిన్ గా కెరీర్ కట్ అయినట్టే. అందుకే కాబోలు, మాళవిక మోహనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా మారుతోంది. ఇప్పటికే నాలుగు వెబ్ సిరీస్ లు ఒప్పుకొంది ఈ భామ. పైగా అవన్నీ హిందీలోనే. హాక్స్, ఫింగర్ ప్రింట్ సీజన్ 2, ఫర్జీ వంటి వెబ్ డ్రామాలు మాళవిక మోహనన్ చేతిలో ఉన్నాయి. తెలుగులో రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

    Also Read: Acharya: ‘అఖండ’కు కాపు కాస్తే.. ‘ఆచార్య’కి వెన్నుపోటు పొడిచారు !

    ఈ సినిమా హిట్ అయి, తెలుగులో కెరీర్ కి ఊపు రావాలి అంటే.. మరో ఏడాది పడుతుంది. అది కూడా ఊహాజనితమే. అందుకే.. హిందీలోకి వెళ్ళిపోయింది. అక్కడ హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టి.. అందరి సౌత్ హీరోయిన్స్ లా అభాసుపాలు అవ్వడం ఎందుకు అనుకుంది ఏమో.. మాళవిక మోహనన్ ఐటమ్ గర్ల్ గానే తనను తానూ హిందీలో పరిచయం చేసుకుంది.

    మొత్తమ్మీద, మాళవిక మోహనన్ ఇక వెబ్ భామగా స్థిరపడ్డట్లే. పైగా హిందీలోనే కెరీర్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అన్నిటికీ మించి వ్యవహారం తేడా జరగకుండా బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకుంటుంది.

    Malavika Mohanan

    తనకు నటించే స్కోప్ ఎలాగూ ఉండదు, కాబట్టి.. ఎక్స్ పోజింగ్ తోనే కెరీర్ ను నెట్టుకు రావాలి. అందుకే.. బోల్డ్ కే తన ఓటు వేసింది. మరి.. బోల్డ్ భామగా నైనా మాళవిక మోహనన్ కి కాలం కలిసి రావాలని ఆశిద్దాం. నిజానికి మొదట్లో ‘మాళవిక మోహనన్’ను చూసి మరో సావిత్రి అవుతుంది అనుకున్నారు, కానీ.. చివరకు షకీలా వారసురాలు అయ్యింది.

    Also Read:Smita Sabharwal: స్మితా సభర్వాల్ కు షాకిచ్చిన హైకోర్టు

    Tags