Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పుడు సంకటంలో పడిపోయారు. కీలక నేతలు చాలా మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. దీంతో పార్టీ భవిష్యత్ పై బెంగ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలనే సంకల్పంతో ఆయన అన్ని మార్గాలు వెతుకుతున్నారు. ఈ సారి అధికారం రాకపోతే ఇక అంతే సంగతి. రాష్ర్టంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదు. దీంతో ఆయన అంతర్మథనంలో పడిపోయారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీని వీడి వెళ్లిపోయిన నేతల కోసం మళ్లీ తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు బేషజాలు ఎందుకని వారి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.

గతంలో జరిగిన ఎన్నికల్లో టికెట్లు రాక కొందరు తమ మాట నెగ్గలేదనే కారణంతో మరొకొందరు పార్టీని వీడి వెళ్లిపోయారు. అక్కడ కూడా సరైన గౌరవం లేక బాధలు పడుతున్నట్లు తెలుసుకున్న వారిని బాబు మళ్లీ పార్టీలోకి రావాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. పార్టీని ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గద్దెనెక్కించాలనే పట్టుదలతో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఆయన పట్టుదలను సైతం వదిలేస్తున్నారు.
Also Read: చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బలమా? బలహీనతా?
పార్టీని వీడి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాల్సిన అవసరం లేదని చెప్పినా ప్రస్తుత పరిస్థితుల్లో వారు రాకపోతే అధికారం రాదనే ఆలోచనలో పడిపోయారు. ఇందులో భాగంగానే వలసవాదులను మళ్లీ అక్కున చేర్చుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అనవసర పట్టింపులకు పోవడం ఇష్టం లేదనే చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో అనేక మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. దీంతోనే వైసీపీకి అంత బలం పెరిగి టీడీపీ పతనం అయిందని తెలుసుకున్నారు. దీంతోనే వారిని మరోమారు తిరిగి పార్టీలోకి చేర్చుకునే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: సెంటిమెంట్ కంటిన్యూ: అసభ్య వ్యాఖ్యలపై చంద్రబాబు భార్య స్పందన