Bigg Boss 5 Telugu Winner: బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అలాగే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే పలు సర్వేలు టాప్ కంటెస్టెంట్స్ ఎవరో తెలియజేశాయి. దీంతో టైటిల్ విన్నర్ ఎవరు కావచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే నిన్నటి ఎపిసోడ్ తో పోరు రసవత్తరంగా మారింది. టైటిల్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్ కి షాక్ తగిలింది. శనివారం బిగ్ బాస్ వేదికపైకి కంటెస్టెంట్స్ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రావడం జరిగింది.

హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ని ప్రేమించే, అభిమానించే సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా నాగార్జునతో పాటు వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు హౌస్ లోని కంటెస్టెంట్స్ కి రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరి కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ వారికి టాప్ రేటింగ్ ఇచ్చారు. టాప్ ఫైవ్ లో మొదటి స్థానం ఇచ్చారు. దీనిని పరిగణలోకి తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, సన్నిహితులు వాళ్ళ కోసం వచ్చారు కాబట్టి, టాప్ రేటింగ్ ఇవ్వడమనేది సహజం. ఇది వాళ్ళ రియల్ ఒపీనియన్ గా తీసుకోకూడదు. అయితే సెకండ్ ర్యాంక్ నుండి వాళ్ళ నిజమైన ఎంపిక మొదలవుతుంది.
Also Read: షణ్ముక్ తో రోమాన్స్.. సిరి తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసిందా?
ఈ ప్రక్రియలో సన్నీ విజయం సాధించారు.వేదికపైకి వచ్చిన మెజారిటీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సన్నీకి ఓటేశారు. రవి మదర్,జబర్దస్త్ అప్పారావు, కాజల్ చెల్లి సరి, మానస్ ఫాదర్… సన్నీకి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. ఇక సన్నీ కోసం వచ్చిన ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ ఆయనకు టాప్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. సిరి లవర్ శ్రీహాన్ అనూహ్యంగా సన్నీకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం ఊహించని పరిణామం. అతడు షణ్ముఖ్ కి రెండవ స్థానం, తన లవర్ సిరికి ఐదవ స్థానం ఇచ్చాడు. ఈ గేమ్ లో రెండు సార్లు ఫస్ట్ ర్యాంక్, నాలుగు సార్లు సెకండ్ ర్యాంక్ సాధించిన సన్నీ టాప్ కంటెస్టెంట్ అని నిరూపించుకున్నారు.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయంలో సన్నీ టైటిల్ విన్నర్. షణ్ముఖ్, రవి, శ్రీరామ్ మానస్ సోదిలో లేకుండా పోయారు. కాగా ఎలిమినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో సిరి, శ్రీరామ్, సన్నీ సేవ్ కావడం జరిగింది. మిగిలిన రవి, ప్రియాంక, షణ్ముఖ్,కాజల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Also Read: వామ్మో ఆ హగ్గులేంటి.. పబ్లిక్ గా సిరి పరువు తీసిన తల్లి!