అంతర్వేది బీజేపీకి ఓటు బ్యాంకుల మారనుందా..?

రెండు సార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. దక్షిణ రాష్ట్రాల్లో పాగా వేయడం మాత్రం అంత ఈజీగా సాధ్యపడడం లేదు. ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ప్రధానంగా హిందుత్వ ఎజెండా, హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న బీజేపీకి.. కుల సమీకరణాల ఆధారంగా గెలుపోటములు నిర్దేశించే దక్షిణాది రాజకీయాలు అచ్చిరాలేదనే చెప్పాలి. అయితే.. ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలు 2024 ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశంలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు […]

Written By: NARESH, Updated On : September 12, 2020 2:03 pm

antarvedi temple

Follow us on


రెండు సార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి.. దక్షిణ రాష్ట్రాల్లో పాగా వేయడం మాత్రం అంత ఈజీగా సాధ్యపడడం లేదు. ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ప్రధానంగా హిందుత్వ ఎజెండా, హిందూ ఓటు బ్యాంకునే నమ్ముకొని రాజకీయాలు చేస్తున్న బీజేపీకి.. కుల సమీకరణాల ఆధారంగా గెలుపోటములు నిర్దేశించే దక్షిణాది రాజకీయాలు అచ్చిరాలేదనే చెప్పాలి. అయితే.. ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలు 2024 ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే అంశంలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  తాజాగా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో ఏపీలో బీజేపీ హిందూ ఓటు బ్యాంక్ కలిసొస్తుందని చెబుతున్నారు.

Also Read: మీడియాకు సంకెళ్లా? స్వామి భక్తిపై హైకోర్టు ఆగ్రహం?

2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో హిందువులు 90.87 శాతం, ముస్లింలు 7.32 శాతం, క్రిస్టియన్లు 1.38 శాతం, ఇతర మతాల వారు 0.43 శాతం ఉన్నారు. చాలాకాలంగా ఏపీలో మత మార్పిడి, తిరుమల వంటి ప్రఖ్యాత దేవాలయాల పరిసరాల్లోనూ అన్యమత ప్రచారంపై హిందువుల నుంచి చాలాసార్లు నిరసన వ్యక్తమైంది. ఏపీలో క్రైస్తవ మత ప్రచారం, అందుకు తగ్గ ఫండ్స్ కూడా పెరిగాయని హిందు సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొద్దికాలంగా ఏపీలో ఆ తరహా మతపరమైన కార్యకలాపాలకు రాజకీయంగానూ అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇటీవల హిందువుల ఆలయాలు, వాటి ఆస్తుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం చర్చనీయంశమయ్యాయి.

ఇందులోభాగంగా టీటీడీ భూములు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. పెద్ద ఎత్తున హిందువుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం.. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోనూ రథం దగ్ధం కావడంపై హిందువుల్లో అసహనం పెరిగింది. హిందూ ఆలయాలకు రోజురోజుకూ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతోందని విమర్శలు చేస్తున్నారు.

Also Read: తెలుగు నేతలను పక్కనపెట్టిన కాంగ్రెస్?

అయితే.. తాజాగా ఈ అంతర్వేది ఘటన బీజేపీ మంచి మైలేజ్‌లా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని నెత్తిన ఎత్తుకుంటే వచ్చ ఎన్నికల్లో హిందూ ఓట్లు రాలుతాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అది 2024 కాకున్నా.. 2‌‌‌029 వరకైనా వర్కవుట్‌ కావచ్చని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఏపీలో తొలిసారి హిందు ఓటు బ్యాంక్ ఖాతా తెరిచేందుకు అంతర్వేది ఘటన బీజం వేసిందని చెప్పుకొచ్చారు.