మీడియాకు సంకెళ్లా? స్వామి భక్తిపై హైకోర్టు ఆగ్రహం?

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టే అధికారంలోకి రాగానే ఐపీఎస్ లను, డీజీపీలను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను అధికారపక్షం మార్చేస్తుంటుంది. సీఎం జగన్ సీఎం అయ్యాక కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేసిన అందరూ పోలీసులను లూప్ హోల్ పోస్టుల్లోకి నెట్టేశాడు. టీడీపీని ధిక్కరించిన వారిని నెత్తిన పెట్టుకున్నారు. Also Read: రూ.12 కోట్లకు టోకరా..: నూతన్‌ నాయుడిపై మరో కేసు ఇక జగన్ నియమించిన టీం […]

Written By: NARESH, Updated On : September 12, 2020 1:32 pm

High Court Of Andhra Pradesh.

Follow us on

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తారనే విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టే అధికారంలోకి రాగానే ఐపీఎస్ లను, డీజీపీలను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను అధికారపక్షం మార్చేస్తుంటుంది. సీఎం జగన్ సీఎం అయ్యాక కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేసిన అందరూ పోలీసులను లూప్ హోల్ పోస్టుల్లోకి నెట్టేశాడు. టీడీపీని ధిక్కరించిన వారిని నెత్తిన పెట్టుకున్నారు.

Also Read: రూ.12 కోట్లకు టోకరా..: నూతన్‌ నాయుడిపై మరో కేసు

ఇక జగన్ నియమించిన టీం ఆయనపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తోంది. అందుకే తాజాగా  ప్రముఖ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ ఓ వీడియోను జగన్ సర్కార్ పై విమర్శనాత్మకంగా ప్రసారం చేసింది. దీనిపై వైసీపీ బ్యాచ్ సీరియస్ అయ్యింది. సీఎం జగన్ పైన.. ప్రభుత్వంపైన అభ్యంతరకంగా  తెలుగువన్ యూట్యూబ్ చానెల్ ప్రసారం చేసిన ఒక వార్తను యూట్యూబ్ లో చూశానని.. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పి.జగదీష్ అనే వ్యక్తి సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరి సీఐడీ పోలీసులు  సదురు న్యూస్ చానెల్ ఎండీ కే రవిశంకర్ పై కేసు నమోదు చేశారు.

కాగా ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ చానెల్ ఎండీ రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ పోలీసుల తీరును తప్పుపడుతూ తీర్పు ఇచ్చింది. యూట్యూబ్ వీడియోలో  కేవలం ప్రభుత్వాన్ని, సీఎంపై ఆరోపణలు మాత్రమే చేశారని దానిపై 505(2) సెక్షన్ కింద కేసు ఎలా నమోదు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు కేసు ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

వెబ్ న్యూస్ చానెల్ ఎండీ కే రవిశంకర్ పై మంగళగిరి సీఐడీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఈ కేసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వెబ్ న్యూస్ చానెల్ నుంచి స్వాధీనం చేసుకున్న సామగ్రిని వెనక్కి ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.

Also Read: ఏపీలో మరో ‘విషపు’ లీకేజీ.. ఏమిటీ ఉపద్రవాలు?

సీఐడీ పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీని సంతృప్తి పరచడానికి చేసినట్లుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలని.. పక్షపాతంతో ప్రజలను వేధింపులకు గురిచేయడం అరాచకత్వానికి దారితీస్తుందని వ్యాఖ్యానించింది. జీవించే హక్కు, స్వేచ్ఛ ప్రతిష్టకు నష్టం కలిగే తీవ్ర పర్యవసనాలకు ఇది దారితీస్తుందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇలా జగన్ పై స్వామి భక్తి సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. హైకోర్టు సాక్షిగా చుక్కెదురైంది. మీడియాకు సంకెళ్లు వేయడం.. అరెస్టులు చేయడం ఏంటని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.