https://oktelugu.com/

కేసీఆర్ ఇప్పుడు చెప్పు.. కేంద్రం ఇచ్చిన లెక్క ఇదీ?

అసెంబ్లీ సాక్షిగా చెలరేగిపోయి  కేసీఆర్ చెబుతుంటే అందరూ నిజమే అనుకున్నారు. కానీ కౌంటర్ వచ్చేసరికి అసలు నిజాలు బయటపడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ పథకాలు బక్వాజ్ అని.. వాళ్లు ఏమీ పైసా ఇవ్వడం లేదని.. సాయం చేయడం లేదని.. జీఎస్టీ పరిహారం ఎగ్గొట్టారని చాలా చెప్పాడు. ఇదంతా టీవీల ముందు కూర్చున్న జనాలు మోడీ తీరుపై కారాలు మిరియాలు నూరారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే.. నిజానికి కేంద్రం చాలా ఇచ్చిందని.. కేసీఆరే వాటిని వాడుకోవడం లేదని కేంద్ర హోంశాఖ […]

Written By: , Updated On : September 12, 2020 / 01:04 PM IST
Kishan-Reddy

Kishan-Reddy

Follow us on


అసెంబ్లీ సాక్షిగా చెలరేగిపోయి  కేసీఆర్ చెబుతుంటే అందరూ నిజమే అనుకున్నారు. కానీ కౌంటర్ వచ్చేసరికి అసలు నిజాలు బయటపడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ పథకాలు బక్వాజ్ అని.. వాళ్లు ఏమీ పైసా ఇవ్వడం లేదని.. సాయం చేయడం లేదని.. జీఎస్టీ పరిహారం ఎగ్గొట్టారని చాలా చెప్పాడు. ఇదంతా టీవీల ముందు కూర్చున్న జనాలు మోడీ తీరుపై కారాలు మిరియాలు నూరారు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపే.. నిజానికి కేంద్రం చాలా ఇచ్చిందని.. కేసీఆరే వాటిని వాడుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాటలు ఇప్పుడు కేసీఆర్ విమర్శల డొల్లతనాన్ని ఎత్తిచూపుతోందని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: ఇదే జరిగితే సీఎంలు, నేతలు శాశ్వతంగా తప్పుకోవాల్సిందేనా?

కరోనా సాయంలో తెలంగాణకు  కేంద్రం ఏం చేయలేదని ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఎండగట్టారు. దానికి కౌంటర్ గా  కేంద్రం ఏం తక్కువ చేయలేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 1400 వెంటీలేటర్లు ఇచ్చామని .. కానీ 500 వెంటీలేటర్లు ఓపెన్ కూడా చేయలేదని కేసీఆర్ సర్కార్ తీరును కిషన్ రెడ్డి ఎండగట్టారు.. ఇచ్చిన వనరులను ఎందుకు సద్వినియోగం చేసుకోరా అని ప్రశ్నించారు.  తెలంగాణకు 13.85 లక్షల ఎన్95 కిట్లు, 241 లక్షల పీపీఈ కిట్లు, 42 లక్షల హెచ్.సీ.క్యూ మాత్రలను తెలంగాణకు కేంద్రం అందజేసిందని కిషన్ రెడ్డి లెక్కలతో సహా చెప్పి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు.

అంతేకాదు వివిధ పథకాల కింద తెలంగాణ కు భారీగానే నిధులు విడుదల చేసినట్టు కిషన్ రెడ్డి వివరాలు చెప్పుకొచ్చారు.  తెలంగాణకు ఉచిత బియ్యం, ఉపాధి, మహిళల జన్ ధన్ ఖాతాలకు రూ.666 కోట్లు  ఖర్చు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. అన్ని రాష్ట్రాలు అమలు చేసి ప్రయోజనం పొందుతున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ ఎందుకు అమలు చేయరని.. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చరు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read: బీజేపీ బండి సంజయ్ ముందున్న సవాళ్లు ఇవే..

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షతో కాదు విచక్షణతో  వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆరోపణలు చేయడం తగదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై వేయడం తగదని కిషన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధ.. కరోనా వైరస్ పై దృష్టిపెడితే బాగుండేదని కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎం మెప్పు కోసమే ప్రధాని మోడీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్రాన్ని అనే హక్కు కేసీఆర్ కు లేదంటూ లెక్కలతో సహా బయటపెట్టి కిషన్ రెడ్డి షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు.