https://oktelugu.com/

Mukesh Ambani : అదానీ అంబానీని క్రాస్ చేస్తారా? వారి ఆస్తి తేడా ఇంత తక్కువనా? అంబానీ ఆస్తులకు ఏమైంది అసలు?

ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకు కూడా ఈయన గురించి తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయి అంటే కూడా చాలా మంది ఈయన పేరు చెబుతుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 3, 2025 / 05:00 AM IST

    Adani , Ambani

    Follow us on

    Mukesh Ambani : ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకు కూడా ఈయన గురించి తెలుసు. ఎందుకంటే మన దగ్గర ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయి అంటే కూడా చాలా మంది ఈయన పేరు చెబుతుంటారు. ఆ రేంజ్ లో పేరు సంపాదించారు అంబానీ. కాదు కాదు డబ్బు సంపాదించారు. ఇక అంబానీ గ్రూప్ షేర్లు ఏ రేంజ్ లో ఉంటాయి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అత్యధిక సంపన్నుడిగా రాజ్యం ఏలుతున్న ఈ అంబానీ తన కుమారుడి పెళ్లికి కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే ఇప్పుడు ఈయన గురించి ఓ విషయం తెలుసుకుందాం.

    రీసెంట్ గా అంబానీ సంపద తగ్గింది అని టాక్. ఇప్పుడు అదానీ గ్రూప్ షేర్ల ర్యాలీ కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన నికర సంపద పెరుగుతుంది అని అటు ముఖేష్ అంబానీ సంపద తగ్గుతుంది అని సమాచారం. ఏకంగా 80.1 బిలియన్ డాలర్లు ఉందట అదానీ నికర సంపద. ఈ సారి ఏకంగా నికర సంపద 3.48 బిలియన్ డాలర్లు పెరిగిందని సమాచారం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. గౌతమ్ అదానీ ప్రపంచంలో 18వ, భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడుగా రాజ్యమేలుతున్నాడు. ఆయన ముఖేష్ అంబానీ కంటే ఒక స్థానం మాత్రమే వెనక ఉన్నారట.

    అయితే ముఖేష్ అంబానీ నికర సంపద 647 మిలియన్ డాలర్లు తగ్గింది. అంటే ఇప్పుడు ఆయన సంపద 90.6 బిలియన్ డాలర్లకు చేరింది అన్నమాట. ఆయన ప్రపంచంలో 17వ స్థానంలో, భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించారు. ముఖేష్ అంబానీ నికర సంపద గౌతమ్ అదానీ కంటే 10.5 బిలియన్ డాలర్లు ఎక్కువ ఉంది. అయితే ఈ సంవత్సరం అదానీ సంపద 4.23 బిలియన్ డాలర్లు తగ్గింది అని తెలిపింది ఈ నివేదిక. ఈ ఇద్దరి మధ్య చాలా తక్కువ తేడానే ఉంది. ఇంకాస్త కష్టపడితే అదానీ అంబానీని దాటేసే అవకాశం కూడా ఉందట.

    ఎలాన్ మస్క్ 442 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు సంపాదించారు. అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్ 241 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్ (209 బిలియన్ డాలర్లు) ఉన్నారు. నాల్గవ స్థానాన్ని లారీ ఎల్లిసన్ సొంతం చేసుకుంటే ఐదవ స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. ఆరో స్థానంలో లారీ పేజ్ నిలిచారు. ఇక ఏడవ స్థానంలో సెర్గీ బ్రిన్ ఉన్నారు. ఎనిమిదవ స్థానంలో బిల్ గేట్స్, తొమ్మిదవ స్థానంలో స్టీవ్ బాల్మర్, పదవ స్థానంలో వారెన్ బఫెట్ లు ఉన్నారు.