
Huzurabad: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించకూడదని ఈసీ ఆదేశిందింది. దీంతో సర్వేలకు చెక్ పడింది. ఏదో ఒక సంస్థ పేరుతో పలు రకాలుగా సంఖ్యలు ఇస్తూ సర్వేల ఫలితాలు ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. ఈ నేపథ్యంలో సర్వేల ఫలితాల ప్రకటన ఉండకూడదని సీరియస్ గా చెప్పింది. దీంతో హుజురాబాద్ గెలుపోటముల ఊహాగానాలు చేయడానికి వీలు లేకుండా పోయింది.
పార్టీలపై ఉన్న అభిమానంతో వారికి అనుకూలంగా కొన్ని సర్వేలు చేస్తూ ఫలానా పార్టీ గెలుస్తుందని ఢంకా బజాయించడం పరిపాటే. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిణామాలు లేకుండా ఈసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏ సంస్థ, పేపర్, వ్యక్తులైనా ఏ రకమైన సర్వే ఫలితాలు ప్రకటించకుండా చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. దీంతో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
గతంలో జరిగిన పొరపాట్లను గ్రహించిన ఈసీ ఈసారి అలా జరగకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను మనోభావాలను దెబ్బతీసేలా సర్వే ఫలితాలు ఉంటాయని గ్రహించిన ఈసీ సర్వేల ఫలితాల ప్రకటనలపై ఆంక్షలు విధించింది. దీంతో సర్వే సంస్థల ఆగడాలకు ముకుతాడు వేసింది. ఇష్టారాజ్యంగా ప్రకటనలు ఇవ్వకూడదని సూచించింది. ఇందుకోసం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
హుజురాబాద్(Huzurabad) లో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఈసీ తెలిపింది. ఎన్నికలు ముగిశాక కూడా ఎలాంటి ప్రకటనలు ఉండకూడదని ఆదేశించింది. నేరుగా ఫలితాల ప్రకటన ఉండాల్సిందేనని సూచించింది. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఎవరైనా శిక్షార్హులవుతారని చెప్పింది. దీంతో పలు సర్వే సంస్థలు ఏం చేయకుండా ఉండిపోవాల్సి వచ్చింది.