https://oktelugu.com/

కేంద్రంతో కేసీఆర్‌‌ కయ్యం అందుకేనా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఈ మధ్య కేంద్రంలో వైరం పెంచుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సర్కార్‌‌ మీద విరుచుకుపడుతున్నారు. తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలని బీజేపీ యోచిస్తోందంటూ కేసీఆర్‌‌ ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి, తమ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శిస్తున్నారు. తాజాగా.. ఓ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బక్వాస్‌ సర్కార్‌ ఉందని.. ఆ ప్రభుత్వం చెప్పే వాటిల్లో 99 శాతం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 10:04 AM IST

    kcr modi

    Follow us on

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ ఈ మధ్య కేంద్రంలో వైరం పెంచుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సర్కార్‌‌ మీద విరుచుకుపడుతున్నారు. తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలని బీజేపీ యోచిస్తోందంటూ కేసీఆర్‌‌ ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి, తమ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శిస్తున్నారు.

    తాజాగా.. ఓ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బక్వాస్‌ సర్కార్‌ ఉందని.. ఆ ప్రభుత్వం చెప్పే వాటిల్లో 99 శాతం అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకోవాలని కేంద్ర బీజేపీ సర్కారు చూస్తోందని.. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన కేసీఆర్‌, వారికి లొంగుతాడా? అని ప్రశ్నించారు. మరి ఉన్నట్టుండి కేసీఆర్‌‌ ఎందుకిలా మాట్లాడుతున్నారు..? ఒకప్పుడు మోడీని మెచ్చుకున్న ఇదే కేసీఆర్‌‌ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు..?

    గతంలో ఎప్పుడూ కూడా కేసీఆర్‌‌ కేంద్రాన్ని టార్గెట్‌ చేయలేదు. కేంద్రంలో సఖ్యతతో ఉంటేనే అన్నివిధాలా మేలని భావించారు. ఒక్కసారిగా ప్లేట్‌ ఫిరాయించడంతో అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అయితే.. మరి కొద్ది రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నిక రాబోతోంది. ఇక్కడ టీఆర్‌‌ఎస్‌ గెలుపు అంత ఈజీగా లేదు. బీజేపీ నుంచే గట్టి పోటీ ఉంది. అందుకే.. కేసీఆర్‌‌ ఇలా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    అందుకే.. ముందస్తుగానే కేంద్రంలో బీజేపీ సర్కార్‌‌ తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్‌ సంస్కరణల బిల్లులకు కూడా టీఆర్‌‌ఎస్‌ మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు.. ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేసి నిరసన కూడా తెలిపింది. ఇప్పుడు వీటినే ప్రజాక్షేత్రంలో వాడుకోవాలని కూడా చూస్తోంది. అయితే.. గతంలో ఇలానే చంద్రబాబు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని చూశారు. కానీ.. ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మరి అప్పుడు చంద్రబాబుతో కాని పని ఇప్పుడు కేసీఆర్ అవుతుందంటారా..? చూడాలి మరి.