గన్నవరంలో సెగలు.. వంశీ వర్సెస్ దుట్టా?

గన్నవరంలో చిచ్చు మొదలైంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓవైపు.. వైసీపీ పార్టీనే నమ్ముకున్నవైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ ఓ వైపు విడిపోయిన వైనం తాజాగా చోటుచేసుకుంది. గన్నవరంలో తన పుట్టినరోజు వేడుకల నిర్వహణలో పోలీసులు ఆంక్షలు పెట్టడంపై వైసీపీ నేత వెంకట్రావ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. ఎమ్మెల్యే, మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని వెంకట్రావ్ ఫైర్ అయ్యారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే […]

Written By: NARESH, Updated On : October 5, 2020 10:01 am
Follow us on


గన్నవరంలో చిచ్చు మొదలైంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతు తెలిసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓవైపు.. వైసీపీ పార్టీనే నమ్ముకున్నవైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ ఓ వైపు విడిపోయిన వైనం తాజాగా చోటుచేసుకుంది.

గన్నవరంలో తన పుట్టినరోజు వేడుకల నిర్వహణలో పోలీసులు ఆంక్షలు పెట్టడంపై వైసీపీ నేత వెంకట్రావ్ తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని.. ఎమ్మెల్యే, మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులు చెబుతున్నారని వెంకట్రావ్ ఫైర్ అయ్యారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని వెంకట్రావ్ స్పష్టం చేశారు.

వైసీపీ నా స్వస్థలమన్న వెంకట్రావ్.. నా సొంత పార్టీ అది అని అన్నారు. వైసీపీ కార్యకర్తలను వంశీ బెదిరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు తన బర్త్ డే చేయవద్దని వంశీ ఇబ్బంది పెట్టారని.. వంశీతో నేను కలిసి పనిచేయడం జరగదని అన్నారు. గన్నవరం వైసీపీలో నాకు గ్రూపులు లేవన్న ఆయన వంశీతో కలిసి పనిచేయనని సీఎం జగన్ కు చెప్పేసానని అన్నారు.

వంశీ తనను అనేక ఇబ్బందులుకు గురిచేస్తున్నారని.. ఈ విషయాలన్నీ సీఎం జగన్ కు చెప్పానని వెంకట్రావ్ అన్నారు.వంశఈ దొంగ ఓట్లతో గెలిచాడని వెంకట్ రావు తీవ్ర విమర్శ చేశారు.