సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8ఏ ప్రకారం ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని ఆర్థికశాఖ వెల్లడించింది ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో, డీఐపీఏఎం (డిపార్ట్ మెంట్ ఆప్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్ మెంట్)కు సూచించింది ఆర్ఐఎన్ఎల్ విక్రయంపై సమాచారం గోప్యమని పేర్కొంటూ పీఎంవో ఆదేశాలను డీఐపీఏఎం పట్టించుకోలేదు.
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. కేంద్ర కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ర్టంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని రాష్ర్ట ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. బీజేపీ మినహా రాష్ర్టంలోని అన్ని రాజకీయ పార్టీలు ఉక్కు పరిశ్రమ నష్టాల్లో కొనసాగుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.