బలమైన ప్రత్యర్థులను తయారు చేస్తున్న జగన్?

ఆంధ్రప్రదేశ్ లో ఓటమి సాధించిన పార్లమెంట్ నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన మూడు లోక్ సభ సీట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఎంపీ సీటులో రామ్మోహన్ నాయుడును ఓడించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరిని రామ్మోహన్ నాయుడిపై పోటీకి దింపి […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 8:24 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఓటమి సాధించిన పార్లమెంట్ నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారించారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన మూడు లోక్ సభ సీట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఎంపీ సీటులో రామ్మోహన్ నాయుడును ఓడించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ తోపాటు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తనయుడు ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరిని రామ్మోహన్ నాయుడిపై పోటీకి దింపి ఓడించాలన్నదే జగన్ వ్యూహం.

విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్లపై కూడా జగన్ సీరియస్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో సామాజిక సమీకరణలు బెడిసి కొట్టడంతోనే ఓడిపోయామని చెబుతున్నారు. ఈ సారి అలా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. విజయవాడ సీటును స్వయంకృతాపరాధంతో కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. చివర్లో వచ్చిన పీవీపికి అయిష్టంగానే సీటు ఇవ్వగా ఆయన ఓడిపోయారు.

కేశినేనికి ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన పోటీ చేసే ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. విజయవాడలో కేశినేనికి చెక్ పెట్టాలంటే మంచి పేరున్న నాయకుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్ రావుతో పాటు ఆయన సోదరుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

బాలవర్థన్ కంటే జైరమేష్ పేరును ప్రతిపాదించాలని స్థానిక నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.జైరమేష్ గతంలో టీడీపీ తరపున ఒకసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి పర్వతనేని ఉపేంద్ర చేతిలో ఓడిపోయారు. వల్లభనేని వంశీతో ఉన్న విభేదాల నేపథ్యంలో గత ఎన్నికలకు ముందే వీరు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కృష్ణ జిల్లా రాజకీయాల్లో ఈ సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఆజాత శత్రువులు అన్న పేరు పొందారు. ఈ క్రమంలో జగన్ సైతం దాసరి జై రమేష్ కే విజయవాడ పార్లమెంట్ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.