https://oktelugu.com/

ఎక్కడున్న చోట అక్కడే కృష్ణా బోర్డు

విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలి. ఇందుకు గాను గత ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకు ప్రపోజల్స్‌ కూడా పంపింది. అయితే.. ఇప్పుడు ఆ కార్యాలయం ఇక హైదరాబాద్‌లోనే ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విజయవాడ కాదు.. విశాఖలో కృష్ణాబోర్డు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ కాబట్టి అక్కడే పెట్టాలని కోరింది. దానికి కృష్ణాబోర్డు కూడా సరేనంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 20, 2021 / 01:59 PM IST
    Follow us on


    విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలి. ఇందుకు గాను గత ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకు ప్రపోజల్స్‌ కూడా పంపింది. అయితే.. ఇప్పుడు ఆ కార్యాలయం ఇక హైదరాబాద్‌లోనే ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల విజయవాడ కాదు.. విశాఖలో కృష్ణాబోర్డు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ కాబట్టి అక్కడే పెట్టాలని కోరింది. దానికి కృష్ణాబోర్డు కూడా సరేనంది.

    Also Read: అక్కడ ఎన్నికలు పెడుదామన్నా ఉద్యోగులు లేరు..!

    అయితే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు అధికారికంగా తెలంగాణ ఈఎన్సీ లేఖ కూడా రాశారు. కృష్ణా బేసిన్‌ దాటి 300 కిలోమీటర్ల అవతల కృష్ణాబోర్డు ఏర్పాటు చేయడం ఏమిటన్నది తెలంగాణ అధికారుల వాదన. తమ వాదనను వారు రాత పూర్వకంగా కృష్ణాబోర్డుకు తెలియచేశారు.

    వా‌స్తవానికి గతంలో విజయవాడలో కృష్ణా బోర్డు ఏర్పాటు అంటే తెలంగాణ సైతం అంగీకరించింది. అదే విషయాన్ని లేఖలో కూడా పేర్కొంది. అయితే.. విజయవాడ అంటే ఒప్పుకున్నాం కానీ.. బేసిన్‌కు సంబంధం లేనిచోట పెట్టడం ఏమిటనేది ఇప్పుడు తెలంగాణ అధికారుల వాదన. విజయవాడలో పెట్టకపోతే హైదరాబాద్‌లోనే ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ తమ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఏపీ సర్కార్ చెబుతున్నప్పటికీ తెలంగాణ అధికారులు మాత్రం వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లోనూ ఈ అంశం చర్చకు దారితీసింది.

    Also Read: ఆ విషయంలో జగన్‌ ఏం చేయబోతున్నారు!

    తెలంగాణ అధికారులు మాత్రం విజయవాడలో పెడితే తమకు అభ్యంతరం లేదనే చెబుతున్నారు. కృష్ణాబోర్డు భేటీ జరిగినప్పుడు అధికారులు హైదరాబాద్ నుంచి రావాల్సిందే. హైదరాబాద్‌లో విజయవాడ విమానానికి బదులు.. విశాఖ విమానం ఎక్కితే పనైపోతుంది. కానీ.. అసలు విశాఖలో వద్దని తెలంగాణ వాదించడం ప్రారభించింది. ఇప్పటికే కృష్ణాబోర్డును కర్నూలులో పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విశాఖకు సంబంధం లేకపోయినా కృష్ణాబోర్డును విశాఖకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ ఆలోచన రాయలసీమ, కోస్తా వాసుల్లోనూ అసంతృప్తికి కారణం అవుతోంది. అందుకే.. దానిని అటు కాకుండా ఇటు కాకుండా హైదరాబాద్‌లోనే ఉంచేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్