Tamil People Called As Arava: మన దేశంలో ప్రాంతాలను బట్టి పేర్లుంటాయి. ఉత్తరాది వారిని ఆర్యులని, దక్షిణాది వారిని ద్రవిడులని పిలుస్తారని చరిత్రలో చదువుకున్నాం. అదే విధంగా మన ప్రాంతాల్లో కూడా వివిధ రకాల పేర్లతో మనల్ని పిలుస్తుంటారు. తెలుగు వారిని ఆంధ్రులని, కేరళవాసులను మలయాళీలని, గుజరాత్ వారిని గుజరాతీలని, కర్ణాటక వారిని కన్నడీయులు అని పిలుస్తుండటం తెలిసిందే. కానీ మనకు ఇక్కడో ట్విస్ట్ ఉంది. కొన్ని ప్రాంతాలను కూడా ఇంకా సెపరేటు పేర్లతో పిలుస్తుండటం తెలిసిందే.
Tamil People Called As Arava
ఇందులో భాగంగానే తమిళులను అరవవాళ్లు, అరవం అని పిలుస్తుంటారు. ఇది చాలా మందికి తెలియని నిజం. వారిని ఎందుకు అలా పిలుస్తారంటే దానికి ఓ చరిత్ర ఉందని తెలుస్తోంది. గతంలో కొన్ని ప్రాంతాలను కలిపి మండలంగా పిలిచేవారట. తమిళులను తొండై మండలంలోని అరవవాడు అనే ప్రాంతం ఉండేది. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో కూడా కొంత ప్రాంతాన్ని అరువనాడు కిందకే వస్తుందని తెలుస్తోంది.
Also Read: Trisha: అప్పుడు స్టార్లకే బిల్డప్ ఇచ్చింది, ఇప్పుడు ఐటమ్ కే ప్రాధేయపడుతుంది !
ఇప్పటికి కూడా కన్నడిగులను కొంగ అని పిలుస్తారట. దీనికి కూడా ఓ కారణముంది. వారు ఉంటున్న ప్రాంతం కొంగనాడు కావడంతో వారిని కొంగ అని పిలుస్తారనే వాదన ఉంది. దీంతో దేశంలో ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలవడం సాధారణమే. ఈ నేపథ్యంలో చారిత్రాత్మక దేశం కావడంతో ప్రాంతాలను బట్టి పేర్లు మారుతుంటాయి. దీనికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.
Tamil People Called As Arava
మనదేశంలో వివిధ రకాల జాతులు, మనుషులు, భాషలు ఉండటంతోనే భిన్నత్వంలో ఏకత్వం వచ్చింది. ఈ క్రమంలోనే మన ప్రాంతాల్లో చాలా తేడాలు ఉండటం గమనించాల్సిందే. కానీ మన జాతి మాత్రం ఒక్కటే భరతజాతి. మనమంతా భారతీయులం అనే భావన అందరిలో ఉండాలి. అప్పుడే సర్వమత సమ్మేళనం సాధ్యమవుతుంది. దేశం ముందకు పోతుంది. దీని కోసమే అందరు తమ దేశం కోసం కలిసి నడవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి.
Also Read:Analysis on Alwar Temple Demolition Clashes: దేవాలయాల కూల్చివేతపై కూడా రాజకీయాలా?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Why tamil people called as arava people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com