Minister Ajay Kumar: ఖమ్మంలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ నాయకుడు సాయిగణేష్ వ్యవహారం అధికార పార్టీకి గుదిబండగా మారుతోంది. టీఆర్ఎస్ భవితవ్యంపై పెను ప్రభావం చూపనుది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకోవడం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. అనతికాలంలోనే మంత్రి పదవి దక్కించుకున్న అజయ్ విషయంలో అధిష్టానం కూడా సీరియస్ గానే ఉన్న్టట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంత్రి అజయ్ పై వేటువేసే ఆలోచనలో కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయాలు ఎటు వైపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితి.

మరోవైపు సాయిగణేష్ ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీని నిందిస్తున్నాయి. టీఆర్ఎస్ దురాగాతాలతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నాయి.దీనికి తోడు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మంత్రి పువ్వాడను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట దీక్ష చేపట్టడం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయింది. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం మంత్రి అజయ్ కుమార్ పై చర్యలకు ఉపక్రమిస్తుందని వార్తలు వస్తున్నాయి.
Also Read: Tamil People Called As Arava: అరవవాళ్లు అంటే తమిళులేనా? అరవం అని ఎందుకు పిలుస్తారు?
మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా చక్రం తిప్పాలని చూస్తున్న నేపథ్యంలో ఖమ్మం రాజకీయాలు కంగారు పెడుతున్నాయి. అప్పుడే రాజకీయవేడి రగులుకుంటోంది. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జిల్లాలోపర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీకి ఇక చిక్కులు తప్పడం లేదని తెలుస్తోంది. అధికారపార్టీనేతలు మంత్రికి అండగా నిలిచినా ప్రయోజనం కనిపించడంలేదు. ఖమ్మంలో ప్రజలందరు సాయిగణేష్ కుటుంబానికే అండగా నిలవడం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయ పరిణామాల్లో మార్పులు వస్తున్నాయి.

సీఎ కేసీఆర్ మంత్రి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. పార్టీ భవితవ్యం కోసం చర్యలు తప్పనిసరని తెలిసిపోతోంది. ప్రతిపక్షాలు సైతం ఏకతాటిపై నిలవడంతో ఇక మంత్రి మనుగడ ప్రశ్నార్థకంలో పడినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బతకాలంటేకొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి. ఈ సందర్భంలో మంత్రి అజయ్ కుమార్ పై వేటు వేయక తప్పదనే వాదనలు సైతం వస్తున్నాయి. ఏదిఏమైనా ఖమ్మం రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని మాత్రం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సీఎం ఆశలు.. ఎంత సింపులో తెలుసా?