పవన్ కళ్యాణ్ బర్త్ డే ఎందుకు చేసుకోరంటే?

రేపు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ రోజును సెలబ్రెట్ చేసేందుకు పవన్ అభిమానులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ బర్త్ డే పేరిట ట్వీటర్లో హ్యాష్ ట్యాగులతో పవన్ అభిమానులు సరికొత్త రికార్డలు నెలకొల్పిన సంగతి తెల్సిందే. పవన్ పుట్టిన రోజున పురస్కరించుకొని సినీ అభిమానులు, జనసేన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా పవన్ వారికి షాకిచ్చే న్యూస్ […]

Written By: NARESH, Updated On : September 2, 2020 8:34 am
Follow us on

రేపు(సెప్టెంబర్ 2న) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే. ఈ రోజును సెలబ్రెట్ చేసేందుకు పవన్ అభిమానులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు అడ్వాన్స్ బర్త్ డే పేరిట ట్వీటర్లో హ్యాష్ ట్యాగులతో పవన్ అభిమానులు సరికొత్త రికార్డలు నెలకొల్పిన సంగతి తెల్సిందే.

పవన్ పుట్టిన రోజున పురస్కరించుకొని సినీ అభిమానులు, జనసేన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా పవన్ వారికి షాకిచ్చే న్యూస్ చెప్పాడు.  తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు పుట్టిన రోజు వేడుకలపై పెద్దగా ఇంట్రస్టు లేదని స్పష్టం చేశారు. చిన్నతనంలో కూడా తాను పెద్దగా పుట్టినరోజును జరుపుకోలేదని తెలిపాడు. ఒకటి రెండుసార్లు స్కూల్లో తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచినట్లు గుర్తు అని తెలిపారు. ఇక కొంచెం వయస్సు వచ్చాక పుట్టిన రోజును జరుపుకోలేదని చెప్పాడు.

తన పుట్టిన రోజుకు గుర్తుంచుకొని తన వదిన డబ్బులు ఇచ్చేదని వాటితో పుస్తకాలు కొనుక్కొనే వాడిని అని తెలిపారు. పుట్టిన రోజున అన్నయ్య కలుసుకోవడం చేస్తుండేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల్లోకి వచ్చాక కొందరు దర్శకులు, నిర్మాతలు పుట్టిన రోజు వేడుకలు చేసేవారని తెలిపారు. అయితే తనకు ఎబ్బెట్టుగా అనిపించడంతో ఆ తర్వాత నుంచి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తుండటాన్ని ఆయన స్వాగతించారు. జనసేనికులు, అభిమానులు చేసే సేవ కార్యక్రమాలు చాలా విలువైనవి తెలిపారు. కరోనా సమయంలోనూ వారు రోగులకు ఉపయోగపడేలా ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేయడం, పేదవారికి దుస్తుల పంపిణీ, అన్నదానం చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండటం ద్వారా తనకు ఆడంబరాలు తనకు గిట్టవని పవన్ మరోసారి నిరూపించారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.