
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత కుమారుడు లోకేష్ బాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు. ఈ ఘోరమైన వైఫల్యం తర్వాత లోకేష్ నాయకత్వంపై టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం తన కొడుకుపై చాలా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 2024 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీకి సంబంధించిన మొత్తం వ్యూహాత్మక ప్రణాళికను లోకేష్‌కు చంద్రబాబు అప్పగించినట్టు సమాచారం. పార్టీ కార్యకలాపాల మొత్తం పర్యవేక్షణను లోకేష్ చూడబోతున్నట్టు తెలిసింది.
2024 ఎన్నికలలో పార్టీ కోసం ప్రచార వ్యూహాన్ని రూపొందించడానికి టిడిపి చీఫ్ కొత్త రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మను నియమించుకున్నట్టు సమాచారం. ఈ రాబిన్ మరెవరో కాదు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన సహచరుడు కావడం విశేషం. పీకే నుంచి విడిపోయి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు. చంద్రబాబు కోసం ఈ సంవత్సరం ప్రారంభం నుంచే పనిచేస్తున్నారు.
రాబిన్ శర్మ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించే బదులు, ఆ పనిని టిడిపి చీఫ్ లోకేశ్‌కు అప్పగించారు. లోకేష్‌కు నేరుగా రిపోర్ట్ చేయమని శర్మను చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఫైనల్ నిర్ణయం లోకేష్ దేనట..
ప్రచార బృందంలో విశ్వసనీయ విధేయులందరినీ లోకేష్ పక్కన పెట్టారని, నేరుగా రాబిన్ శర్మ జట్టుపై ఆధారపడి ఉందని తెలిసింది.ఇక లోకేష్ ను ప్రజల్లో పాపులర్ చేసే బాధ్యతను కూడా రాబిన్ కే చంద్రబాబు అప్పగించినట్టు సమాచారం.