ముద్రగడ ఎందుకు సైలెంట్‌ అయ్యారు..!

కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. కానీ.. ఇప్పుడు ఆ ఉద్యమం నుంచి ముద్రగడ పూర్తిగా సైడ్‌ అయినట్లుగానే కనిపితోంది.  ఇన్నాళ్లు ఉద్యమాన్ని ఓస్థాయిలో నడిపించిన ముద్రగడ.. గత కొద్ది నెలల క్రితం తాను తప్పుకుంటున్నట్లు […]

Written By: NARESH, Updated On : November 5, 2020 1:06 pm
Follow us on


కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు.. కాపుల సమస్యల పరిష్కారం.. కాపుల హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం కొన్నేళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్ర కూడా చేశారు. మొన్నటివరకు ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం బలంగా నడిచింది. కానీ.. ఇప్పుడు ఆ ఉద్యమం నుంచి ముద్రగడ పూర్తిగా సైడ్‌ అయినట్లుగానే కనిపితోంది.  ఇన్నాళ్లు ఉద్యమాన్ని ఓస్థాయిలో నడిపించిన ముద్రగడ.. గత కొద్ది నెలల క్రితం తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాపు ఉద్యమంలో జరుగుతున్న పరిణామాలే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయి. సొంత సామాజిక వర్గం నుంచే తనపై విమర్శలు ఎక్కువయ్యాయని, తాను ప్రస్తుతమున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని నడపలేనని ముద్రగడ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

వీటి పరిణామాల నేపథ్యంలో ముద్రగడ రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లేనని కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లపాటు ముద్రగడ పద్మనాభం యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ పాదయాత్ర కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పాదయాత్ర జరగలేదు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఏకంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో కొద్ది నెలలుగా ఆయన కిర్లంపూడికే పరిమితమయ్యారు. రాజకీయాల్లో పెద్దగా దూరడం లేదు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందుల పాలయ్యానని ముద్రగడ పద్మనాభం సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట కూడా. అయితే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలనే కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారన్న వాదన కూడా లేకపోలేదు. తన రాజకీయ ఎదుగుదలకు కాపు రిజర్వేషన్ ఉద్యమం అడ్డంకిగా మారిందని ఆయన భావించినట్లు వార్తలు వచ్చాయి.

Also Read: అక్రమాస్తుల కేసు: జగన్‌ వర్గంలో తీవ్ర ఉత్కంఠ

ముద్రగడ ఉద్యమం నుంచి తప్పుకొని బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో సోము వీర్రాజు కూడా ముద్రగడతో చర్చలు జరిపారు. దీంతో ఈ వాదనకు మరింత బలం చేకూరింది. కానీ ముద్రగడ పద్మనాభం మాత్రం బీజేపీలో చేరేందుకు కూడా విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఇక రాజకీయాల్లో కొనసాగలేనని చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద చూస్తే ముద్రగడ పద్మనాభం ఇక రాజకీయాల నుంచి రిటైర్‌‌మెంట్‌ తీసుకున్నట్లేనని పలువురు అంటున్నారు.